మంగళవారం, 16 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 ఫిబ్రవరి 2023 (08:37 IST)

బాపట్ల జిల్లా మేదరమిట్ల బైపాస్ రోడ్డులో కారు ప్రమాదం - ఐదుగురి మృతి

car accident
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా మేదరమిట్ల బైపాస్ రోడ్డులో గత రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒంగోలు నుంచి గుంటూరు వైపు వెళుతున్న కారు టైరు కొరిశపాడు మండలం మేదరమిట్ల బైపాస్ సమీపంలో పంక్చరైంది. దీంతో కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా ఎగిరి అటువైపు పడింది. ఆ సమయంలో గుంటూరు నుంచి ఒంగులో వైపు వెళుతున్న లారీ ఒకటి కారును ఢీకొట్టింది. 
 
ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులు ప్రమాదం స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ప్రమాద వార్త తెలుసుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసిన విచారణ జరుపుతున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.