రూ.1800 నగదు కోసం భార్యాభర్తల గొడవ.. చెట్టుకు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య
భార్యాభర్తల గొడవపడటంతో మనస్తాపానికి గురై ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కార్వాన్ సత్యనారాయణకాలనీకి చెందిన జగ్గేటి కిషన్, శ్యామల దంపతులకు ముగ్గురు కూతుళ్లు. కిషన్ జియాగూడ కబేళాలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పెద్ద కూతురు వివాహం జరిపించారు.
ఇదిలా ఉంటే.. ఈ నెల 15వ తేదీన రూ.1800 నగదు విషయం భార్య శ్యామల గొడవపెట్టుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కిషన్ అదే రోజు సాయంత్రం ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి 7 గంటలకు కుటుంబీకులు ఫోన్ చేస్తే త్వరగానే ఇంటికి వచ్చేస్తానని చెప్పినా ఇంటికి రాలేదు.
చివరికి గురువారం సాయంత్రం కార్వాన్ రాంసింగ్‌పురా చౌరస్తా సమీపంలోని మూసీనది ఒడ్డున ఓ చెట్టుకు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న కిషన్‌ను స్థానికులు గమనించి పోలీసులుకు, కుటుంబీకులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.