1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Cancellation and Partial Cancellation of Trains over Godavari express derails issue

గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం.. 12 రైళ్లు తాత్కాలికంగా రద్దు

godavari express
విశాఖపట్టణం నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ బీబీనగర్ వద్ద బుధవారం ఉదయం పట్టాలు తప్పింది. మొత్తం నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేశారు. 12 రైళ్ళను తాత్కాలికంగా రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను వేరే మార్గాల్లో దారి మళ్లించారు. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. దీంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
 
ఇదిలావుంటే, ప్రమాదం కారణంగా పట్టాలు తప్పిన బోగీలను అక్కడే వదిలేసి మిగితా బోగీలతో రైలు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంది. బోగీలు నిలిచిపోయిన కారణంగా ఆ మార్గం మీదుగా ప్రయాణించాల్సిన ఏడు రైళ్లను రద్దు చేశారు. మరో 12 రైళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు దక్షిణ రైల్వే విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
కాగా, ఈ ప్రమాదం కారణంగా రద్దు చేసిన రైళ్ల వివరాలను పరిశీలిస్తే, కాచిగూడ - నడికుడి, నడికుడి - కాచిగూడ, సికింద్రాబాద్ - వరంగల్, వరంగల్ - హైదరాబాద్, గుంటూరు - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - రేపల్లే రైళ్లు రద్దు చేశారు. 
తర్వాతి కథనం
స్టీల్ ప్లాంట్‌తో జిల్లా రూపు రేఖలు మారిపోతాయ్ : సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి