ఇటలీ అమ్మమ్మకు ప్రియాంక అంటే ఎంతో ఇష్టం.. నాకు పిల్లలు కావాలనివుంది!! (video)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన వివాహంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు పిల్లలు కావాలని ఉందని చెప్పారు. అదేసమయంలో ఇటలీలో ఉన్న తన అమ్మమ్మకు తన సోదరి ప్రియాంకా గాంధీ అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. అలాగే, తన గడ్డం తీయడంపై ఇంకా ఏ విషయం నిర్ణయించుకోలేదని చెప్పారు.
తాజాగా ఆయన ఓ ఇటాలియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటివరకు ఎందుకు వివాహం చేసుకోలేదో తెలియదని ఆయన చెప్పారు. అదేసమయంలో తనకు పిల్లలు కావాలని ఉందని చెప్పారు. ఇటలీ ఉండే తన అమ్మమ్మ పావ్‌లామాయినోకు తన సోదరి ప్రియాంక గాంధీ అంటే ఎంతో ఇష్టమని, ఆమెను ప్రాణప్రదంగా చూసుకుంటారని చెప్పారు.
ఇప్పటివరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదన్న ప్రశ్నకు రాహుల్ ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. నిజం చెప్పాలంటే.. పెళ్ళి ఎందుకు చేసుకోలేక పోయానో తెలియదని, కాకపోతే ఈ విషయం తనకే విచిత్రంగా ఉంటుందని చెప్పారు. చాలా పనులు చేయాల్సి ఉందన్న ఆయన తనకు పిల్లలు కావాలని ఉందని మనసులోని మాటను బయటపెట్టారు.
తాను చేపట్టిన జోడో యాత్రపై ఆయన స్పందిస్తూ, యాత్ర పూర్తయ్యేంత వరకు గడ్డం తీయకూడదని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. అయితే, ఈ యాత్ర పూర్తయిందని, ఇపుడాగడ్డాన్ని ఉంచాలా? తీసేయాలా? అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.