మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 జనవరి 2023 (12:09 IST)

శ్రీనగర్‌లో ముగియనున్న భారత జోడో యాత్ర.. రాహుల్ కీలక ప్రసంగం

rahul - raghuram
అఖిల భారత కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జోడో యాత్ర చేపట్టారు. ఆయన గత సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో పాదయాత్ర ప్రారంభించారు. అనంతరం కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌, 2 కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు 12 రాష్ట్రాలలో పాదయాత్ర చేసి 19వ తేదీన జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంలోకి ప్రవేశించారు. ప్రతి రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ వాదులు, ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. 
 
రాహుల్ గాంధీ పాదయాత్రలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మాజీ మంత్రులు, విపక్ష నేతలు, సినీ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కూడా కొన్ని రాష్ట్రాల్లో యాత్రలో పాల్గొన్నారు.
 
కాశ్మీర్‌లో రాహుల్ పాదయాత్ర ప్రారంభించి నేటికి 130వ రోజు. ఆయనతో పాటు కాంగ్రెస్‌ నాయకులు, మహిళా టీమ్‌ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదులు తరచూ దాడులకు పాల్పడుతుండటంతో ఆయనకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 
 
మొత్తం 3,970 కిలోమీటర్ల మేర సాగిన రాహుల్ సంఘీభావ యాత్ర 30వ తేదీ (సోమవారం)తో ముగియనుంది. ఈ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. శ్రీనగర్‌లో జరిగిన ముగింపు కార్యక్రమంలో రాహుల్ గాంధీ జాతీయ జెండాను ఎగురవేసి కీలక ప్రసంగం చేశారు.