సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 జనవరి 2023 (15:01 IST)

రాహుల్ - ప్రియాంక స్నోబాల్ ఫైటింగ్.. ఎక్కడ?

rahul priyanka
భారత్ జోడో యాత్ర సోమవారం శ్రీనగర్‌లో ముగిసింది. ఇందులో ఆసక్తికర సంఘటన ఒకటి చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు చిన్నపిల్లల్లా మారిపోయారు. సరదాగా మంచుతో ఆట్లాడుకున్నారు. మంచు గడ్డలను ఒకరిపై ఒకరు ఎత్తిపోసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
శ్రీనగర్‌లో గత కొన్ని రోజులుగా విపరీతంగా మంచు కురుస్తుంది. దీంతో ఎటు చూసినా మంచు పేరుకునిపోయింది. ఈ మంచులో తన సోదరి ప్రియాంకతో కలిసి రాహుల్ ఆటలాడుతున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇందులో రాహుల్ తన సోదరి ప్రియాంకను మంచు గడ్డలతో ఆటపట్టించడం, అన్నపైకి ప్రియాంక గాంధీ మంచు గడ్డలను విసరడం కనిపిస్తుంది.