గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 ఫిబ్రవరి 2023 (18:38 IST)

విషమంగానే డాక్టర్ ప్రీతి ఆరోగ్య పరిస్థితి.. వైద్యులు

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ (కేఎంసీ)లో సీనియర్ వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నం చేసిన పీజీ విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి విషమంగానే వుందని వైద్యులు తెలిపారు. 
 
నిమ్స్ వైద్యులు డాక్టర్ ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై విడుదల చేసిన తాజా బులెటిన్‌లో ప్రస్తుతం ప్రీతికి అత్యాధునిక వైద్యం అందిస్తున్నామని.. ఆమెను కాపాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రీతికి ఎక్మో, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని చెప్పారు. అయితే ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే వుందని తెలిపారు.
 
కేఎంసీలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్న డాక్టర్ ఎంఏ సైఫ్ వేధింపుల వల్లే డాక్టర్ ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిందని పోలీసులు తెలిపారు. 
 
వాట్సాప్ హిస్టరీ పరిశీలించాక వేధింపులకు కొన్ని ఆధారాలు లభించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ సైఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.