సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (13:44 IST)

విషపూరిత ఇంజెక్షన్ వేసుకుని వరంగల్ ఎంజీఎం వైద్యురాలు సూసైడ్ అటెంప్ట్

suicide
తెలంగాణ రాష్ట్రంలోని వంరగల్ జిల్లా కేంద్రంలో ఉన్న మహాత్మా గాంధీ వైద్య కాలేజీకి చెందిన వైద్యురాలు ఒకరు విషపూరిత ఇంజెక్షన్ వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎంజీఎం వైద్య కాలేజీ ప్రిన్సిపాల్ మోహన్ దాస్ ధృవీకరించారు. 
 
కాకతీయ వైద్య కాలేజీలో పీజీ అనస్తీషియాగా విద్యాభ్యాసం చేస్తున్నా డాక్టర్ ధరవాత్ ప్రీతి బుధవారం తెల్లవారుజామున సూసైడ్ అటెంప్ట్ చేశారు. విధుల్లో వున్నపుడు ఆమె హానికరమైన ఇంజెక్షన్ వేసుకున్నారు. దీన్ని తోటి వైద్యులు గుర్తించి ఆమెకు అత్యవసర సేవల విభాగానికి తరలించి చికిత్స అందించారు. 
 
అయితే, ఆమె ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ప్రీతి ఆత్మహత్యకు ప్రయత్నించి విషయాన్ని ప్రిన్సిపాల్ మోహన్ దాస్ ధృవీకరించారు. రెండు రోజుల క్రితం డాక్టర్ ప్రీతిని సీనియర్ వైద్యులు వేధించారన్న ప్రచారం సాగుతోంది. ఈ ఘటనపై ప్రీతి ఫిర్యాదు మేరకు సీనియర్ వైద్యులను కూడా ప్రిన్సిపల్ మందలించినట్టు సమాచారం. అయినప్పటికీ ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.