శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (16:52 IST)

నాలుగేళ్ల బాలుడిని పొట్టనబెట్టుకున్న హైదరాబాద్ వీధికుక్కలు

Dogs
Dogs
హైదరాబాద్‌లోని హౌసింగ్ సొసైటీలో నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసిన భయానక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇప్పుడు బయటకు వచ్చింది.
 
ఈ వీడియోలో, వీధి కుక్కల సమూహం అతనిపై దాడి చేసినప్పుడు బాలుడు సరదాగా తిరుగుతూ కనిపించాడు. బాలుడు తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేశాడు. కానీ ఫలించలేదు.
 
సంఘటన జరిగిన హౌసింగ్ కాంప్లెక్స్‌లో చిన్నారి తండ్రి గంగాధర్ సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తున్నారు. చిన్నారి ఏడుపు విన్న తండ్రి ఘటనా స్థలానికి చేరుకుని బాలుడిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
 
గంగాధర్ తన కుటుంబంతో సహా నిజామాబాద్ నుండి ఉద్యోగం కోసం హైదరాబాద్‌లో నివాసం వుంటున్నాడు. గంగాధర్‌ పనిచేస్తున్న అపార్ట్‌మెంట్‌లోని కాంపౌండ్‌లో ఆడుకుంటున్న అతని కుమారుడు ఆదివారం వీధి కుక్కల దాడికి గురైయ్యాడు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.