గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (11:21 IST)

మూడోసారి కూడా ఆడపిల్ల పుట్టిందనీ తండ్రి ఆత్మహత్య.. ఎక్కడ?

suicide
సాధారణంగా ఆడ పిల్లలు పుడితే వారిని చంపేస్తుంటారు. కానీ, ఇక్కడ ఓ విచిత్ర విషాద ఘటన జరిగింది. తన భార్యకు మూడో కాన్పులోనూ ఆడపిల్ల జన్మించడంతో తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగరులో జరిగింది. 
 
దీనిపై అత్తాపూర్ ఔట్‌పోస్ట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కిషన్ జీ స్పందిస్తూ, సులేమాన్ నగరుకు చెందిన మహ్మద్ అహ్మద్ (35) అనే వ్యక్తి స్థానికంగా ఉండో ఓ ఫర్నీచర్ షాపులో పని చేస్తున్నాడు. ఈయనకు భార్య అహ్మద్ ఉన్నారు. వీరికి ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల మూడో కాన్పు కోసం కర్నాటక రాష్ట్రంలోని తన పుట్టింటికి వెళ్లింది. ఆమె తాజాగా మూడో బిడ్డకు జన్మినిచ్చింది. ఈ కాన్పులోనూ ఆమెకు ఆడశిశువే జన్మినించింది.
 
ఈ విషయం తెలుసుకున్న అహ్మద్.. తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. గత కొన్ని రోజులుగా ముభావంగా ఉంటూ కుటుంబ సభ్యులతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.