మోకిల నివాసం నుంచి ఫిల్మ్ ఛాంబర్‌కు తారకరత్న పార్థివదేహం
గత నెల 27వ తేదీన గుండెపోటుకు గురై గత 23 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన హీరో తారకరత్న భౌతికకాయాన్ని హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన మోకిల నుంచి ఫిల్మ్ చాంబర్‌కు తరలించారు. అక్కడ ఆయన అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంచి, సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు పూర్తి చేసేలా ఏర్పాట్లుచేశారు.
అంబులెన్స్‌లో తారకరత్న భౌతికకాయం పక్కనే బాలకృష్ణ, వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలు కూర్చొన్నారు. ప్రస్తుంత మోకిలలోని నివాసం నుంచి భారీ సంఖ్యలో తరలి వచ్చిన అభిమానుల సమక్షంలో భౌతికకాయాన్ని ఫిల్మ్ చాంబర్‌కు తరలించారు.
భౌతికకాయం ఉన్న అంబులెన్స్ వెనుక దాదాపు 200కు పైగా వాహనాలు ఉన్నాయి. పది గంటలకు ఫిల్మ్ చాంబర్‌కు చేరుకునే భౌతికకాయం మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడే ఉంచుతారు. అయితే, భౌతికకాయాన్ని ఇంటి నుంచి తరలించేముందు తారకరత్నకు ఆయన కుమారుడితో అంతిమ క్రతువు నిర్వహించారు.