సోమవారం, 7 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

ఏపీ రాజధాని అమరావతి : పార్లమెంటులో స్పష్టం చేసిన కేంద్రం

amaravati capital
నవ్యాంధ్ర రాజధాని అమరావతే అని కేంద్రం మరోమారు పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశాన్ని తమ దృష్టికి తీసుకునిరాలేదని కేంద్రం తేల్చి చెప్పింది. అందువ్లల ఆ మూడు రాజధానుల వ్యవహారం తమకు తెలియదని, నవ్యాంధ్ర రాజధాని మాత్రం అమరావతే అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ లిఖిపూర్వత సమాధానమిచ్చారు.
 
వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానిమిస్తూ విభజన చట్టం మేరకు ఏపీ రాజధానిగా అమరావతిని 2015లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిందని గుర్తు చేశారు. విభజన చట్టంలోని సెక్షన్ 5, 6 ప్రకారం రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు సంబంధించిన విషయంలో అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు కమిటీని ఏర్పాటు చేసిందన్నారు.
 
ఆ కమిటీ ఇచ్చిన సూచనలు, సలహాలు నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించగా, దాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేస్తూ నోటిఫికేషన్ జారీచేసిందని, ఆ తర్వాత సీఆర్డీయేను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు.