గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 జనవరి 2023 (17:18 IST)

నవ్యాంధ్ర రాజధానిపై మరో పిటిషన్ - 31న విచారణ?

navyandhra
నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర విభజన సమయంలో శివరామకృష్ణ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలైంది. ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. నిజానికి నవ్యాంధ్ర రాజధాని అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలైవున్నాయి. తాజాగా మరో పిటిషన్ దాఖలు కావడం గమనార్హం. 
 
రాజధాని అమరావతి విషయంలో శివరామకృష్ణ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ అనే వ్యక్తి ఈ పిటిషన్‌‌ను దాఖలు చేశారు. ఇప్పటికే మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. రాజధానిపై అంశఁపై హైకోర్టు తీర్పును ప్రభుత్వం సవాల్ చేస్తూ అపెక్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇపుడు ఈ పిటీషన్లన్నింటిపై ఈ నెల 31వ తేదీన అపెక్స్ కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.