మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 జనవరి 2023 (17:20 IST)

ఆదిపురుష్‌పై మరో వివాదం.. ట్రైలర్‌ను అలా విడుదల చేశారట!

adipurush movie still
ఆదిపురుష్‌పై మరో వివాదం తెరపైకి వచ్చింది. ఆదిపురుష్ మూవీ సంక్రాతికి రిలీజ్ కావాల్సింది. కానీ.. ట్రైలర్‌పై వచ్చిన ట్రోల్స్, విమర్శలతో పునరాలోచనలో  చిత్ర బృందం పడింది. ఆపై విడుదలను వాయిదా వేసుకుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ సెన్సార్ బోర్డు నుంచి అనుమతి తీసుకోకుండానే గత ఏడాది ట్రైలర్‌ని విడుదల చేసిందట. 
 
ఈ విషయంపై అలహాబాద్ హైకోర్టులో తాజాగా తివారి అనే వ్యక్తి పిల్ వేశారు. దాంతో విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు.. వివరణ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకి నోటీసులిచ్చింది. సెన్సార్ బోర్డు నుంచి ఆదిపురుష్ ట్రైలర్ అనుమతి తీసుకోలేదని.. ఇది నిబంధనలకు విరుద్ధమని తివారి చెప్పారు. 
 
ఇంకా చర్యలు తీసుకోవాల్సిందేనని అలహాబాద్ హైకోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు  విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది. 
 
ఇకపోతే..ప్రభాస్, కృతిసనన్ హీరోహీరోయిన్లుగా ఆది పురుష్ తెరకెక్కుతోంది.  ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకుడు. ఇక ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా కనిపిస్తున్నాడు. ఈ ఏడాది జూన్ 16న ఈ సినిమా రిలీజ్ కానుంది.