గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 14 జనవరి 2023 (16:05 IST)

కాన్సెప్ట్ పోస్టర్ తోనే ఆడియో రైట్స్ అమ్మేసుకున్న అన్నపూర్ణ ఫొటో స్టూడియో

Annapurna Photo Studio  concept poster
Annapurna Photo Studio concept poster
ఓ పిట్ట కథ చిత్రంతో సక్సెస్ సాధించి ప్రతిభవంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న చెందు ముద్దు దర్శకత్వంలో చైతన్య రావ్, లావణ్య హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం  "అన్నపూర్ణ ఫొటో స్టూడియో". ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ ని, టైటిల్ ని దర్శకుడు హరీష్ శంకర్ లాంచ్ చేయగా, అద్భుతమైన స్పందన లభించింది. 80 దశకం గ్రామీణ నేపథ్యంతో సాగే క్రైమ్ కామెడీ చిత్రంగా కనిపిస్తూ "అన్నపూర్ణ ఫొటో స్టూడియో" అనే టైటిల్, ఇచ్చట అందంగా ఫొటోలు తీయబడును అనే క్యాప్షన్ ఆకట్టుకునేలా ఉండడంతో చిత్రంపై అంచనాలు మొదలయ్యాయి.
 
కాన్సెప్ట్, కథతో పాటు పాటలు విపరీతంగా నచ్చటంతో, ఈ మధ్య ఏ చిన్న సినిమాకి రాని ఫ్యాన్సీ మొత్తానికి "అన్నపూర్ణ ఫొటో స్టూడియో" ఆడియో రైట్స్ సొంతం చేసుకుంది ప్రఖ్యాత ఆడియో సంస్థ టి-సిరీస్. "పెళ్లి చూపులు", "డియర్ కామ్రేడ్", "దొరసాని" వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన యష్ రంగినేని, బిగ్ బెన్ సినిమాస్ 6వ చిత్రంగా దీనిని తెరకెక్కిస్తున్నారు.
 
నటీనటులు : చైతన్య రావ్, లావణ్య, మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య తదితరులు.