సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 27 డిశెంబరు 2022 (13:39 IST)

అన్నపూర్ణ ఫొటో స్టూడియో కాన్సెప్ట్ పోస్టర్, టైటిల్ రివీల్ చేసిన హరీష్ శంకర్

Annapurna Photo Studio Concept Poster
Annapurna Photo Studio Concept Poster
"పెళ్లి చూపులు", "డియర్ కామ్రేడ్", "దొరసాని" వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన బిగ్ బెన్ సినిమాస్ సంస్థ తన 6వ చిత్రానికి అన్నపూర్ణ ఫొటో స్టూడియో అనే టైటిల్ ను ఖరారు చేశారు. యష్ రంగినేని నిర్మిస్తున్న ఈ చిత్రంలో చైతన్య రావ్, లావణ్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఓ పిట్ట కథ చిత్రంతో ప్రతిభవంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న చెందు ముద్దు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 
 
గ్రామీణ నేపథ్యంగా సాగే క్రైమ్ కామెడీ చిత్రమిది. తాజాగా ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్, టైటిల్ ను దర్శకుడు హరీశ్ శంకర్ చేతుల మీదుగా అనౌన్స్ చేశారు. అన్నపూర్ణ ఫొటో స్టూడియో అనే టైటిల్, ఇచ్చట అందంగా ఫొటోలు తీయబడును అనే క్యాప్షన్ ఆకట్టుకునేలా ఉన్నాయి. 
 
ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ...చాలా రోజుల తర్వాత ఓ మంచి టైటిల్ చూశాను. అప్పట్లో ప్రతి ఊరిలో ఒక ఫొటో స్టూడియో ఉండేది. ఫొటోస్ ప్రింట్ అయి వచ్చే వరకు మనం ఎదురుచూసేవాళ్లం. 80 దశకం బ్యాక్ డ్రాప్ తో పాటు క్రైమ్ కామెడీ జానర్ ఆకట్టుకుంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నాను. టైటిల్, పోస్టర్ డిజైన్ చూడగానే సినిమా చూడాలనే ఆసక్తి కలుగుతోంది. ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. అన్నారు.
 
దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ...మా సినిమా టైటిల్, కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేసిన హరీష్ శంకర్ గారికి థాంక్స్. 80 దశకం నేపథ్యంలో ఒక ఊరిలో సాగే క్రైమ్ కామెడీ చిత్రమిది. గతంలో నా పిట్ట కథ సినిమాను ఆదరించినట్లే ఈ సినిమానూ ఇష్టపడతారని ఆశిస్తున్నాను. అన్నారు.
 
హీరో చైతన్య రావ్ మాట్లాడుతూ...నాకు పేరు తీసుకొచ్చిన 21 వెడ్స్ 30 ప్రమోషన్ కు హరీష్ శంకర్ గారు సపోర్ట్ చేశారు. ఇప్పుడు మా అన్నపూర్ణ ఫొటో స్టూడియో టైటిల్ అనౌన్స్ చేసి బ్లెస్ చేశారు. ఈ సినిమా బాగా వస్తోంది. ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. అన్నారు.
 
హీరోయిన్ లావణ్య మాట్లాడుతూ...మా టీమ్ కు సపోర్ట్ చేసిన హరీష్ గారికి థాంక్స్. ఇక నుంచి రెగ్యులర్ మా టీమ్ నుంచి అప్డేట్స్ వస్తుంటాయి. మీ సపోర్ట్ కావాలి. అన్నారు.
 
నటీనటులు : చైతన్య రావ్, లావణ్య, మిహిరా, ఉత్తర, రాఘవ, ఆదిత్య తదితరులు
సాంకేతిక నిపుణులు : సంగీతం - ప్రిన్స్ హెన్రీ, సినిమాటోగ్రఫీ - పంకజ్ తొట్టాడ, ఎడిటర్ - డి వెంకట్ ప్రభు, పీఆర్వో - జీఎస్కే మీడియా, బ్యానర్ -బిగ్ బెన్ సినిమాస్, నిర్మాత - యష్ రంగినేని, రచన దర్శకత్వం - చెందు ముద్దు.