గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 జనవరి 2023 (16:49 IST)

రామసేతును జాతీయ చిహ్నంగా ప్రకటించాలి.. సుప్రీం ఏం చెప్పిందంటే?

Ramasethu
Ramasethu
రామసేతు వంతెనను జాతీయ చిహ్నంగా ప్రకటించాలంటూ మాజీ కాంగ్రెస్ నేత సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన వ్యాజ్యంపై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నట్లు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెలిపింది. రాముని వంతెనను జాతీయ చిహ్నంగా ప్రకటించాలని కోరుతూ సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై ఫిబ్రవరి మొదటి వారంలో సుప్రీంకోర్టులో సమాధానం ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 
 
దీనికి సంబంధించి ఫిబ్రవరి మొదటి వారంలోగా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సేతు సముద్రం ప్రాజెక్టు వల్ల రామసేతువు దెబ్బతింటుందని, అందుకే రామసేతు వంతెనను జాతీయ చిహ్నంగా ప్రకటించాలని సుబ్రమణ్యం సామి కొన్ని నెలల క్రితం కేసు వేశారు. 
 
ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీలో సేతు సముద్రం ప్రాజెక్టు అమలుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీర్మానం తీసుకురాగా, రామసేతువును జాతీయ చిహ్నంగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయనుండడం గమనార్హం.