1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated: మంగళవారం, 31 జనవరి 2023 (14:24 IST)

త్వరలోనే నవ్యాంధ్ర రాజధానిగా విశాఖపట్టణం : ఏపీ సీఎం జగన్

jagan
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి మంగళవారం సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే విశాఖ నుంచి పాలన ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ మేరకు ఢిల్లీలో జరుగుతున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సన్నాహక సదస్సులో ఆయన పాల్గొని ఈ ప్రకటన చేశారు. త్వరలోనే విశాఖ ఏపీ రాజధాని కాబోతుందని ఆయన ప్రకటించారు. అలాగే, తాను విశాఖకు మకాం మార్చబోతున్నట్టు తెలిపారు. 
 
అందువల్ల పారిశ్రామికవేత్తలను కూడా విశాఖకు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే 12 శాతం వృద్దిరేటుతే ఏపీ అగ్రస్థానంలో ఉందని ఆయన చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గత మూడేళ్ళుగా ఏపీ అగ్రస్థానంలో నిలుస్తుందని ఆయన గుర్తు చేశారు. విశాఖలో సుధీర్ఘ తీరప్రాంతం ఉందని చెప్పారు.