1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. BJP MLA Etela fires on kcr government

దేశంలో ఎక్కడా ఇలా జరగలేదు.. ఉద్యోగులు ఆత్మహత్య చేసుకోవడమా?

BJP MLa
తెలంగాణ సీఎం కేసీఆర్ బదిలీల పేరిట ఉద్యోగులకు నానా తంటాలకు గురిచేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బదిలీలు అంటూ 317 జీవోను తీసుకువచ్చి ఉద్యోగులను ఆత్మహత్యలు చేసుకునేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఈటల చెప్పారు.
 
ఈ నర్సంపేట వాసి ఉప్పుల రమేష్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. దేశంలో ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటన ఎక్కడ లేదు. ఉద్యోగాల సంఘాలతో చర్చించి వెంటనే ఈ జీవోను రద్దు పరిచి వారికి న్యాయం చేయాలని ఈటల డిమాండ్ చేశారు.  
 
ఉప్పుల రమేష్ కుటుంబానికి బీజేపీ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఆయన కుటుంబానికి ఆర్దిక సహాయంగా రూ. 50 వేలను ఈటల రాజేందర్ అందజేశారు. కేసీఆర్ ఉద్యోగులతో చర్చించకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, నెటివిటీ లేక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు అని పార్టీల నాయకులు చెప్పిన వినకుండా కేసీఆర్ మొండి వైఖరి అవలంబిస్తున్నారని ఫైర్ అయ్యారు
About Writer
సెల్వి
తర్వాతి కథనం
దిల్‌దార్‌ బనే దే ప్రచారం: అమితాబ్‌- పూజాహెగ్డేలను ఒకే దరికి తీసుకువచ్చిన మాజా