1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Coronavirus cases exceeding 7 thousand in Telangana

తెలంగాణలో 7 వేలు దాటిన కరోనావైరస్ కేసులు

Coronavirus
హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా మహమ్మారి ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 1,03,770 పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 7,432 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో 33 మంది మరణించారు.

కరోనా బారి నుంచి నిన్న 2,152 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 58,148 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 1,464 కేసులు నమోదయ్యాయి.
About Writer
ఎం
తర్వాతి కథనం
తెలంగాణ ప్రైవేటు స్కూల్‌ సిబ్బంది ఖాతాల్లో రూ.22.56 కోట్లు జమ