ఆంధ్రప్రదేశ్ కోవిడ్ నైట్ కర్ఫ్యూ, ఏవి మూతబడతాయి? ఏవి పని చేస్తాయి?
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. రాత్రి 10గంటల నుంచి ఉదయం 5గంటల వరకూ అత్యవసర సేవలు మినహా మిగిలినవి ఏవీ పని చేయవు.
దుకాణాలు, ప్రజా రవాణా, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లను మూసి వేయనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని మంత్రి ఆళ్లనాని తెలిపారు.
కర్ఫ్యూ నుంచి..
★ ఫార్మసీలు,
★ ల్యాబ్‌లు,
★ మీడియా,
★ పెట్రోల్ బంక్‌లు,
★ శీతల గిడ్డంగులు,
★ గోదాములు,
★ అత్యవసర సర్వీసులకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది.
★ వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లే రోగులకు ఎలాంటి ఆంక్షలు ఉండవు.