సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 21 ఏప్రియల్ 2021 (19:57 IST)

నేటి అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి 17 కోవిడ్ కేర్ సెంటర్లు : అనంతపురము జిల్లా కలెక్టర్

అనంతపురము జిల్లాలో నేటి అర్ధరాత్రి నుంచి 17 కొవిడ్ కేర్ సెంటర్లు అందుబాటులోకి తెచ్చి 5420 బెడ్లు వెంటనే సిద్ధంచేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అధికారులు ఆదేశించారు.

బుధవారం హాస్పిటల్స్ సన్నదత,హోమ్ఐసోలేషన్, అంబులెన్స్,కాంట్రాక్ట్ ట్రేసింగ్ , హోమ్ ఐసోలేషన్, ఆక్సిజన్ లభ్యత తదితర అంశాలపై జిల్లాలోని నోడల్ అధికారులు, మెడికల్ అధికారులు, తాసిల్దార్లు,మున్సిపల్ కమిషనర్,లు ఎంపీడీవోలు, డి ఎం హెచ్ ఓ ,జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
 
 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కోవిడ్ బారినపడిన కరోనా రోగులకు చికిత్స అందించే విధంగా 17 కోవిడ్ కేర్ సెంటర్లను ఈరోజు  అర్ధరాత్రి నుంచే అందుబాటులోకి తీసుకు రావాల్సిందిగా సంబంధిత నోడల్ ఆఫీసర్లను కలెక్టర్ ఆదేశించారు.

వాటిలో 5420 బెడ్లు వెంటనే సిద్ధంచేయాల్సిందిగా ఆయన సూచించారు.కోవిడ్ కేర్ సెంటర్లలో మెడికల్ ఆఫీసర్ల టీమ్, శానిటేషన్ ,ఫుడ్డు ,రెవిన్యూ, పోలీస్ టీం తదితర 7 టీం లను ఏర్పాటు చేయాలన్నారు. నోటిఫైడ్ ఆస్పత్రుల జాబితాను, నోడల్ ఆఫీసర్ల జాబితాను కోవిడ్ కేర్ సెంటర్లలో ఉంచాలన్నారు.

జిల్లాలోఈరోజు వరకు 18 హాస్పిటల్లో 1900బెడ్లు ఏర్పాటు చేశామని, ఇదివరకే గుర్తించిన 39 హాస్పిటల్లో మిగిలిన 21 హాస్పిటల్స్  మొత్తం 39 ఆస్పత్రుల్లో కూడా కోవిడ్ వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

వాటిలో నోడల్ అధికారులను నియమించి బెడ్లనుసైడ్ఫామ్ చేసి,ఎన్ని బెడ్లు అందుబాటులో వున్నాయో డిస్ప్లే చేయడం, హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసి, అందులో చేర్పించిన వ్యాధిగ్రస్తులకు వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ట్రయేజింగ్ సెంటర్లలో ఈసీజీ, ఎక్స్రే, పల్స్ ఆక్సి మీటర్లు ,తదితర సామాగ్రిని వెంటనే ఏర్పాటు చేసి , అందుకు సంబంధించిన ఫోటోలను తనకు పంపాలని డి సి హెచ్ ఎస్ డాక్టర్ రమేష్ నాధ్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 
జిల్లాలో ప్రస్తుతం చేస్తున్న పరీక్షల సామర్థ్యాన్ని ఎనిమిది వేలకు పెంచాల్సి ఉందన్నారు.

అందుకు అనుగుణంగా టెస్టింగ్ కిట్లను కూడా అందుబాటులో ఉంచుకోవాలన్నారు.సేకరించిన శాంపిల్స్ ఆరు గంటల లోపు ల్యాబ్కు పంపించేలా చర్యలు తీసుకోవాలన్నారు.డిమాండ్కు సరిపడా ఆక్సిజన్ నిల్వలకు మూడు రెట్లు అధికంగా ఆక్సిజన్ స్టాక్ ఉంచుకునేలా ప్రణాళిక రూపొందించుకోవాలని డ్రగ్స్అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ రెడ్డిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

పాజిటివ్ వచ్చిన వ్యక్తుల మొదటి ,రెండవ కాంటాక్ట్ ట్రేసింగ్ సక్రమంగా నిర్వహించడం లేదని వీటిని పకడ్బందీగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు .ఇందుకు సంబంధించి సంబంధిత ఆర్ డి వో లు వారి డివిజన్ పరిధిలో నమోదయ్యే పాజిటివ్ కేసులు ఆధారంగా  సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ, పాజిటివ్ గుర్తించిన వ్యక్తుల మొదటి, రెండవ కాంటాక్ట్ ట్రేసింగ్ జాబితాలను సిద్ధం చేసి పంపాలన్నారు.

ఇందుకు సంబంధించి ప్రతి ఒక్క పాజిటివ్ కేసు కు 10 ప్రైమరీ కాంట్రాక్టులను, 21 మందికి పైబడి సెకండరీ కాంట్రాక్టులను గుర్తించాల్సి ఉందన్నారు .జిల్లాలో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వ్యాధిగ్రస్తుల వద్దకి డాక్టర్లను సక్రమంగా పంపి, ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి ఆశా వర్కర్లు ,ఏఎన్ఎంలు హోమ్ ఐసోలేషన్ లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి కిట్లను అందించాలన్నారు.

కోవిడ్ కేర్ సెంటర్లలో డాక్టర్లు సిబ్బంది కొరత లేకుండా ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా డిఎంహెచ్ఓ ను కలెక్టర్ ఆదేశించారు .అలాగే జనరల్ హాస్పిటల్ లో ఇతర హాస్పిటల్ లో కూడా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా కలెక్టర్ సూచించారు. వైద్యాధికారులు ,వైద్య సిబ్బంది  కేటాయింపులకు సంబంధించి జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) పర్యవేక్షించాల్సిందిగా కలెక్టర్ సూచించారు.

పాజిటివ్ గా గుర్తించిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించాలని ,అందుకు అనుగుణంగా అంబులెన్సులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. నోడల్ అధికారులకు కేటాయించిన విధులను సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమర్థవంతంగా నిర్వహించాలన్నారు.
 
జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి)డా.ఏ.సిరి మాట్లాడుతూ, పరీక్ష కేంద్రాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు ఆటోల ద్వారా అనౌన్స్ చేయాలని ,టామ్ టామ్ ద్వారా, పత్రికా ప్రకటనలు జారీ చేయడం ద్వారా ప్రజలకు తెలియజెప్పాలని సంబంధిత ఎంపీడీవోలు , మున్సిపల్ కమిషనర్లకు ఆమె సూచించారు. 

సేకరించిన శాంపిల్స్ లకు సంబంధించి ఐసీఎంఆర్ సీట్లపై అనంతపురం అని రాసి పంపుతున్నారని, అంతేకాకుండా ఆధార్ లో ఉన్న చిరునామానమోదు చేస్తున్నారని అలా కాకుండా ప్రస్తుతం వారు నివసిస్తున్న చిరునామాను నమోదు చేయాలన్నారు. ప్రస్తుతం వ్యాధి లక్షణాలు ఉన్నవారికి ,ప్రైమరీ కాంటాక్ట్ ఉన్నవారికి, డాక్టర్లు సిఫార్సు చేసిన వారికి ,పాజిటివ్ వ్యాధిగ్రస్తుల కోరిక మేరకు పరీక్షలు చేస్తున్నామని ఆమె తెలిపారు.

కాంటాక్ట్ ట్రెసింగ్ అయ్యాక టెస్టింగ్ చేపట్టాలన్నారు. పాజిటివ్ వచ్చిన వారికి ముందుగా కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. హోమ్ ఐసోలేషన్ కు సిఫారసు చేసిన వారి ఆరోగ్య స్థితిగతులను ఆశావర్కర్లు,ఏఎన్ఎంలు ఎప్పటికప్పుడు వారి ఇంటికి వెళ్లి పరిశీలించి సంబంధిత వ్యక్తుల ఫోన్ నెంబర్లను సంబంధిత సచివాలయాల్లో డిస్ప్లే చేయాలన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లలో అన్ని వసతులు ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
 
ఈ కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ (రైతు భరోసా కేంద్రాలు మరియు రెవిన్యూ )నిశాంత్ కుమార్, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.