సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 ఏప్రియల్ 2021 (17:42 IST)

12 ఆవులపై యాసిడ్‌ పోసిన దుండగులు..

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం జరిగింది. 12 ఆవులపై గుర్తు తెలియని దుండగులు యాసిడ్‌ పోశారు. నారాయణపురం, రాజేంద్రనగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో గుర్తు తెలియని దుండగులు ఆవులపై యాసిడ్‌తో దాడి చేశారు. ఆవులకు తీవ్ర గాయాలయ్యాయి. దాడికి గురైన ఆవులకు పశు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఆవుల యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆవులు ప్రతి రోజు బయటకు వెళ్లి సాయంత్రానికి ఇంటికి తిరిగివస్తాయని… అవి బయట తిరుగుతున్నప్పుడు దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని తెలుస్తోంది.