మంగళవారం, 14 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (14:43 IST)

తెలంగాణలో ‘ప్రైవేటు’ సిబ్బందికి రూ. 2 వేలు

కరోనాతో ప్రైవేటు పాఠశాలలు మూతపడి కొలువులు కోల్పోయిన వారికి నెలకు రూ.2 వేల చొప్పున నగదు సహాయం మంగళవారం నుంచి అందనుంది. నగదుతో పాటు, 25 కిలోల సన్న బియ్యం పొందేందుకు మొత్తం 1,24,704 మంది బోధన, బోధనేతర సిబ్బంది అర్హులుగా తేలారు. 
 
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సోమవారం సాయంత్రం లెక్కలు తేల్చి ఆర్థిక, పౌరసరఫరాల శాఖకు జాబితాను అందజేసింది. ఈనెల 20-24 వరకు రూ.2 వేల చొప్పున నగదు సాయం దరఖాస్తుదారుల బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. ఈనెల 21-25 వరకు వారికి రేషన్‌ దుకాణాల ద్వారా బియ్యం అందజేస్తారు.