1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Daughter in Law held for Plotting Mother in Laws Murder Case in Suryapet

ఆస్తి కోసం పనోడుతో అత్తను హత్య చేయించిన కోడలు

Daughter in Law
ఆస్తి కోసం సొంత అత్తనే హత్య చేయించింది ఓ కోడలు. పనోడితో ఈ దారుణానికి ఒడిగట్టింది. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట మండలం కుసుమవారిగూడెంలో ఈ దారుణం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గూడెంకు చెందిన ఓ మహిళ భర్త ఏడాదిన్నర క్రితం చిపోయాడు. అప్పటి నుంచి ఒంటరిగా జీవిస్తూవస్తోంది. ఈమె పేరు కుసుమ లలితమ్మ. ఈమెకు ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు ఉన్నారు. 
 
కూతుర్ల పెళ్లిళ్లు అయ్యాయి. కుమారుడు సూర్యాపేట పట్టణంలో కిరాణం వ్యాపారం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఉన్న పొలంలో ఇద్దరు కూతుళ్ళకు చెరో ఎకరం ఇవ్వగా ఇంకా మూడున్నర ఎకరాలు ఉంది. భర్త చనిపోయాక మిగిలిన పొలం తమ పేరు మీద పట్టా చేయాలంటూ కొద్దిరోజులుగా కోడలు విజయలక్మి అత్త లలితమ్మతో గొడవపడుతూ వచ్చింది. 
 
మామ చనిపోయాక ఉన్న డబ్బులు ఆడపడుచులకు ఇచ్చావని, పొలం కూడా వాళ్ళకే ఇస్తావంటూ నిందించేది. ఎన్నిసార్లు పొలం తమ పేరుమీద పట్టా చేయాలని అడిగినా అత్త వినకపోవడంతో, అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. అన్నుకున్నదే తడవుగా అత్త దగ్గర పొలం పని చేస్తున్న సైదులుని సంప్రదించి హతమార్చేలా ఒప్పించింది.
 
దీంతో ఒంటరిగా నిద్రిస్తున్న లలితమ్మను కత్తితో సైదులు హతమార్చాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సూర్యాపేట రూరల్ పోలీసులు, మృతురాలి దగ్గర పనిచేసే సైదులు ప్రవర్తన మీద అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించగా అసలు నిజం ఒప్పుకున్నాడు. నిందితులు విజయలక్మి, సైదులు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
తర్వాతి కథనం
ప్రజల సొమ్ముతో ఇచ్చే పథకాలకు మీ పేర్లు ఎందుకు? పవన్ కళ్యాణ్