మా ఆయనకు వివాహేతర సంబంధాలు వున్నాయి, అందుకే చంపేసి వుంటారేమో?
తెలంగాణ రాష్ట్రంలోని వెల్దుర్తి మండలంలో సంచలనం సృష్టించిన హత్యకు కారణాలు వెలికివచ్చాయి. ఆర్థిక లావాదేవీల విషయమై తేడాలు రావడంతో మెదక్ జిల్లాకు చెందిన శ్రీనివాస్‌ను దుండగులు హతమార్చారు. కారులోనే అతడిని హత్య చేసి ఆ తర్వాత కారుతో సహా నిప్పంటించి శవాన్ని దగ్దం చేసినట్లు పోలీసులు తెలిపారు.
కాగా అంతకుముందు తన భర్త శ్రీనివాస్ హత్యపై అతడి భార్య హైందవి చేసిన ఫిర్యాదు మరోలా వుంది. తన భర్తకు వివాహేతర సంబంధాలు వున్నాయనీ, తనతో తరచూ గొడవపడుతుంటాని పేర్కొంది. అతడి హత్య వెనుక వివాహేతర సంబంధం వున్నదేమోనని అనుమానం వ్యక్తం చేసింది. కానీ శ్రీనివాస్ హత్యకు కారణం ఎఫైర్ కాదనీ, ఆర్థిక లావాదేవీలని పోలీసులు తేల్చారు.