1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Husband Choking Wife and Murder

అనుమానం పెనుభూతమైంది... భార్య గొంతు కోసిన భర్త

Husband
పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతోనే ఓ భర్త కసాయిగా ప్రవర్తించాడు. భార్య గొంతుకోసి చంపేశాడు. ఈ దారుణం లింగ సముద్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ గ్రామానికి చెందిన కొటికలపూడి నరసింహం, రమణమ్మ (47) భార్యభర్తలు. నరసింహం ప్రతి రోజూ మద్యం తాగొచ్చి వివాహేతర సంబంధ పెట్టుకుంటుందనే అనుమానంతో భార్యను చిత్రవధ చేసేవాడు.
 
ఈ పరిస్థితుల్లో ఆదివారం తెల్లవారుజామున భార్యతో గొడవకు దిగి తీవ్ర ఆగ్రహంతో ఆమె జుట్టు పట్టుకుని కత్తితో గొంతు కోశాడు. రమణమ్మ కేకలు విని చుట్టుపక్కల వారు ఇంటి వద్దకు చేరుకున్నారు. 
 
అప్పటికే ఆమె మరణించడంతో భర్త అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న కందుకూరు డీఎస్పీ కండె శ్రీనివాసులు, సీఐ శ్రీరాం, గుడ్లూరు ఎస్సై మల్లికార్జున సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
 
పరారీలో ఉన్న నరసింహాన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా రమణమ్మను తానే హతమార్చినట్లు ఒప్పుకొన్నాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. 
తర్వాతి కథనం
అన్నయ్యతో నిశ్చితార్థం.. తమ్ముడితో పెళ్లి.. ఆమె ఆత్మహత్య..?