సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 ఆగస్టు 2021 (15:59 IST)

పెళ్లైన 3 నెలలకే జైలుకెళ్లాడు.. భర్తకు బెయిల్ ఇవ్వండి.. నేను గర్భం ధరించాలి..

ఉత్తరాఖండ్ హైకోర్టు ముందుకు ఓ వింత పిటిషన్ వచ్చింది. అత్యాచార ఆరోపణలపై జైలు వుంటున్న భర్తకు బెయిల్ ఇవ్వాలని.. అతని ద్వారా బిడ్డను కనాలని అతని భార్య కోర్టును ఆశ్రయించింది. పెళ్లైన మూడు నెలలకే భర్త జైలుకెళ్లాడని.. తమకు కలిసి ఉండే అవకాశమే లభించలేదని, సహృదయంతో అర్థం చేసుకుని, భర్తకు బెయిల్ ఇప్పించాలని కోరింది.
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌కు చెందిన సచిన్ అనే వ్యక్తి, మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసు విచారణలో సచిన్‌తో పాటు మిగిలిన దోషులకు 20 ఏళ్ల జైలుశిక్ష పడగా.. ఏడేళ్ల నుంచి సచిన్ జైల్లోనే ఉంటున్నారు. 
 
అయితే, భర్తతో తనకు కలిసి ఉండే అవకాశం కావాలని సచిన్‌ భార్య కోర్టును కోరింది. మాతృత్వంలోని మాధుర్యాన్ని అనుభవించేందుకు నా భర్తకు షార్ట్ టర్మ్ బెయిల్ ఇప్పించాలంటూ ఆమె హైకోర్టును ఆశ్రయించిది.
 
తన భర్తకు కొంతకాలం బెయిల్ ఇస్తే తాను గర్భం దాల్చేందుకు అవకాశం వస్తుందని, అమ్మను అవ్వడం.. భార్యగా భర్తతో కలవడం తన హక్కు అని ఆమె తన పిటిషన్‌లో స్పష్టం చేసింది. అయితే, ''అత్యాచారం కేసులో దోషిగా నిరూపణై జైలుశిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి బెయిల్ ఇవ్వొచ్చా? అనే అంశంపై పరిశీలిస్తోంది. 
 
అంతేకాదు, తండ్రి లేని బిడ్డను తల్లి ఒక్కతే పోషించడం చాలా కష్టమైన విషయం, ఇలాంటి పరిస్థితుల్లో బిడ్డను కనడం కోసమే నిందితుడికి ఎలా బెయిల్ ఇవ్వగలం అని ప్రశ్నిస్తోంది. తండ్రి లేకుండా పెరిగే బిడ్డల మానసిక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం కూడా ఉందని, ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తమకు సరిగా తెలియడం లేదని, దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని న్యాయమూర్తులు చెప్పారు.