సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 10 ఆగస్టు 2021 (13:35 IST)

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఆమెకు 50మంది బాయ్ ఫ్రెండ్స్.. భర్తను ఏం చేసిందంటే?

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఆమెకు 50మంది బాయ్ ఫ్రెండ్స్.. వున్నారు. ఈ షాకింగ్ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని సేలంలో షాలినీ, ప్రభుదేవా భార్యాభర్తలు. షాలినీ వయసు 22 ఏళ్లు. ప్రభుదేవా షాలిని కంటే 17 ఏళ్లు పెద్దవాడు. దీంతో భర్త అంటే పెద్దగా ఇష్టముండేది కాదు షాలినికి. ప్రభుదేవా భార్య షాలినీని బాగానే చూసుకునేవాడు. 
 
కానీ భర్త ఎంత బాగా చూసుకున్నా షాలినికి తనకంటే భర్త 17 ఏళ్లు పెద్దవాడే అసంతృప్తి పోయేది కాదు. దీంతో భర్తతో సరిగా ఉండేది కాదు. కానీ ప్రభుదేవా సర్దుకుపోయేవాడు. దీన్ని అలుసుగా తీసుకున్న షాలిని ఎప్పుడు ఫోన్ పట్టుకునే కూర్చునేది. సోషల్ మీడియాలో చాలా చాలా యాక్టివ్ గా ఉండేది. ఈ క్రమంలో పరిచయం అయినవారితో గంటల తరబడి ఫోన్ లో మాటలు..ఛాటింగ్ లు. నిత్యం సోషల్ మీడియాలో బాయ్ ఫ్రెండ్స్ తో టచ్ లో ఉండేది.
 
ఈక్రమంలో అదే ప్రాంతానికి చెందిన సెల్వరాజ్ అనే వ్యక్తితో కూడా వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన భర్త ప్రభుదేవా భార్యను మందలించాడు. ఇటువంటి పనులు మానుకోవాలని పదే పదే చెప్పాడు. కానీ షాలినీ ఏమాత్రం మార్చుకోలేదు. ఓసారి భర్త లేని సమయంలో సెల్వరాజ్ ను ఇంటికి పిలిపించుకుంది షాలినీ. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న టైమ్ లో భర్త ప్రభుదేవా ఇంటికొచ్చాడు. 
 
రూమ్‌లోఉన్న ఇద్దర్నీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. భార్యకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఇకనైనా నీ పద్ధతి మార్చుకోకపోతే బాగుండదని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో భర్తపై షాలినీ ఆగ్రహంతో రగిలిపోయింది. భర్త పీడ వదిలించుకోవాలనుకుంది. అదే విషయం తన ప్రియుడు సెల్వరాజ్ కు చెప్పింది. అలా ఇద్దరూ కలిసి ప్రభుదేవానికి పక్కా ప్లాన్ వేసి అంతమొందించారు.
 
భర్తను చంపేసిన తరువాత ఏమీ తెలియనట్లుగా.. పోలీస్ స్టేషన్‌కు కంగారు కంగారు పడుతున్నట్లుగా నటిస్తూ ఫిర్యాదు చేసింది.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కానీ ఏదో అనుమానం పోలీసులకు వచ్చింది. అలా కేసును లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు షాలినీ, సెల్వరాజ్ లకు వివాహేతర సంబంధం ఉన్నట్లుగా తెలుసుకున్నారు. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు విషయాన్ని బైటపెట్టారు.
 
షాలినిని విచారించిన పోలీసులు ఆమెకు ఏకంగా 50 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలుసుకుని షాక్ అయ్యారు. షాలినిపై హత్యా నేరం కేసు నమోదు అయిందని తెలుసుకున్న సోషల్ మీడియా ఫ్రెండ్స్ తమ సెల్ ఫోన్స్ స్విచాఫ్ చేసేశారు. అలా సోషల్ మీడియా యావలో పడి అసంతృప్తితో వివాహేతర సంబంధాలు పెట్టుకుని కటకటాల పాలైంది.