సంబంధిత వార్తలు
- ముత్యాలు మెడకు చున్నీ బిగించి చంపేసిన భార్య - ప్రియుడు
- నేతన్నకు చేయూత కార్యక్రమాన్ని పునః ప్రారంభించిన మంత్రి శ్రీ కేటీఆర్
- వివాహేతర సంబంధానికి భర్త అడ్డు.. ప్రియుడితో కలిసి చంపేసింది..!
- కేసీఆర్ చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి..?: విజయశాంతి ఫైర్
- తెలంగాణాలో బీజేపీని విస్తరిస్తాం... తెరాసను బొందపెడతాం : ఈటల ఫైర్
ఆదిలాబాద్ జిల్లాలో గడువు తీరిన మందులు
ఆదిలాబాద్ రిమ్స్‌లో రోగులకు గడువు తీరిన మందులు, ఇంజక్షన్ వేయడంపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ సిక్తాపట్నాయక్‌కు ఆసుపత్రిలో ఎక్స్‌పైర్ అయిన మందులు ఇచ్చిన విషయంపై వివరించారు.
దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా రిమ్స్ ఆసుపత్రిలో సేవలు మెరుగు పరిచేందుకు డాక్టర్లు, అధికారులు మరింత బాధ్యతగా పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందులో సొసైటీ మాజీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షుడు సాయిచరణ్‌గౌడ్ తదితరులున్నారు.
కేసు నమోదు చేయాలి..
రిమ్స్‌లో రోగులకు గడువు తీరిన మందులు, ఇంజక్షన్ వేయడంపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్‌ఖాన్ అన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు.
రిమ్స్‌లో ఆదివారం రాత్రి పేషెంట్లకు గడువు తీరిన ఇంజక్షన్లను ఇవ్వడంపైనే కాకుండా రిమ్స్‌లో జరుగుతున్న అవకతవకలపై విచారణ చేపట్టాలని బీజేపీ నాయకురాలు సుహాసినిరెడ్డి కలెక్టర్‌ను కలిసి కోరారు.
తర్వాతి కథనం
