శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 జూన్ 2021 (19:07 IST)

వివాహేతర సంబంధానికి భర్త అడ్డు.. ప్రియుడితో కలిసి చంపేసింది..!

తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో భర్తను భార్య, ఆమె ప్రియుడు కలిసి హత్య చేశారు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. కందిబండ గ్రామానికి చెందిన ముళ్లగిరి నాగరాణి, ముత్యాలు భార్యభర్తలు. అయితే నాగరాణి అదే గ్రామానికి చెందిన మేరిగ నవీన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

ఈ విషయం ముత్యాలు (28) కు తెలిసి కదలించాడు. దాంతో తమ సంబంధానికి అడ్డువస్తున్నాడని భావించిన ఇరువురు ముత్యాలును హత్య చేయాలని పథకం పన్నారు. 
 
ఈ క్రమంలో ఈ నెల 7న ముత్యాలు కూలి పనులకు వెళ్లి వచ్చి మద్యం సేవించి ఇంట్లో నిద్రించాడు. అదే అదనుగా భావించిన నాగరాణి, నవీన్ లు ముత్యాలు మెడకు చున్నీ బిగించి హత్యచేశారు.

ఉదయం తన భర్త గుండెపోటుతో మృతి చెందాడని అందరిని నమ్మించింది. కాగా ముత్యాలు మృతిపై కుటుంబ సభ్యులు ఆమెను నిలదీయగా హత్య చేసినట్టు ఒప్పుకొని పారిపోయింది.
 
దాంతో మృతుడి సోదరుడు వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతదేహానికి ఆదివారం తహసీల్దార్‌ దామోదర్‌రావు, సీఐ శివరామిరెడ్డి సమక్షంలో పోలీసులు పంచనామా నిర్వహించారు. నిందితులు పరారీలో ఉన్నారని త్వరలో వారిని అరెస్టు చేస్తామని ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు.