గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 14 జూన్ 2021 (18:05 IST)

భర్తను చంపి అది కోసి పెనంపై కాల్చి ఫ్రై చేసిన భార్య, ఎక్కడ?

బ్రెజిల్‌కు చెందిన ఒక మహిళ తన భర్తను దారుణంగా హత్య చేసింది. ఆ తరువాత అతని మర్మాంగాన్ని కోసేసింది. అంతేకాదు కోసేసిన మర్మాంగాన్ని వంట చేసింది. ఈ దారుణానికి పాల్పడిన 33యేళ్ళ మహిళను అరెస్టు చేశారు పోలీసులు.
 
మృతుడు మచాడో  విగతజీవిగా పడి ఉండడాన్ని పోలీసులు గమనించారు. పోలీసులు చెప్పిన వివరాలు ప్రకారం భార్య శాంతాకిటారియా భర్త మర్మాంగాన్ని కోసేసి పెనం మీద నూనెలో వేసి వేయించిందట. ఉదయం 4 గంటల సమయంలో ఈ దారుణం జరిగి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు.
 
ఆస్తి విషయంలో జరిగిన గొడవ కారణంగానే శాంతా కిటారియా ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. నిందితురాలు ఉపయోగించిన వంటగదిలోని కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యతో పాటు వేధింపుల కేసులో శాంతా కిటారియాను పోలీసులు అరెస్టు చేశారు. పదేళ్ళపాటు కలిసి ఉన్నారు వీరిద్దరు. 
 
వీరిద్దరికి 8 యేళ్ళ కూతురు, ఐదేళ్ళ కొడుకు ఉన్నారు. అయితే ఈ ఘాతుకం జరిగిన సమయంలో బాధితులు అక్కడే ఉన్నారా అన్న విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన ముందురోజు రాత్రి వీరిద్దరు బార్‌కు వెళ్ళి పూటుగా మద్యం సేవించినట్లు పోలీసులు తెలిపారు.