శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 15 జూన్ 2021 (08:39 IST)

త్రివేండ్రం-గువహటి మధ్య ప్రత్యేక రైళ్లు

పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు దక్షిణరైల్వే త్రివేండ్రం - గువహటి మధ్య ప్రత్యేక వేసవి రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. 06185 నెంబరు ప్రత్యేక రైలు త్రివేండ్రం నుంచి ఈనెల 19, 26, జూలై 3, 10 తేదీల్లో సాయంత్రం 6 గంటలకు బయలుదేరి నాలుగో రోజు ఉదయం 9 గంటలకు గువహటి చేరుకుంటుంది.

అదేవిధంగా 06186 నెంబరు ప్రత్యేక రైలు ఈ నెల 23, 30, జూలై 7, 14 తేదీల్లో ఉదయం 6.45 గంటలకు గువహటిలో బయలుదేరి మూడోరోజు రాత్రి 11.10 గం టలకు త్రివేండ్రం చేరుకుంటుంది. ఈ రైలుకు 12 స్లీపర్‌ క్లాస్‌, 8 జనరల్‌ సెకండ్‌ క్లాస్‌, లగేజ్‌ కం బ్రేక్‌ వ్యాన్‌ 2 కోచ్‌లుంటాయని దక్షిణరైల్వే విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

త్రివేండ్రం నుంచి బయలుదేరే రైలు మరు నాడు ఉదయం 10.15 గంటలకు చెన్నై సెంట్రల్‌ చేరు కుంటుంది. ఈ రైళ్లు త్రివేండ్రం, కొల్లం, చెంగన్నూర్‌, కొట్టాయం, ఎర్నాకుటం టౌన్‌, త్రిశూర్‌, పాల్ఘాట్‌, కోయంబత్తూర్‌, తిరుపూర్‌, ఈరోడ్‌, సేలం, జోలార్‌పేట, కాట్పాడి, చెన్నై సెంట్రల్‌, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్‌, పలాస తదితర స్టేషన్లలో ఆగుతాయి.