శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 25 జనవరి 2021 (10:37 IST)

27నుంచి తిరుపతికి రెండు ప్రత్యేక రైళ్లు

తిరుపతి- ఆదిలాబాదు, కాకినాడపోర్టు- రేణిగుంట మధ్య ఈనెల 27నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

తిరుపతిలో ఈ ప్రత్యేకరైలు (07405) ఉదయం 5.50 గంటలకు బయల్దేరి రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, వరంగల్‌, ఖాజీపేట, సికింద్రాబాదు మీదుగా ఆదిలాబాదుకు మరుసటి రోజు ఉదయం చేరుకుంటుందన్నారు.

అలాగే ఈ రైలు (07406) రాత్రి 9.05గంటలు ఆదిలాబాదులో బయల్దేరి వెళ్లిన మార్గంలోనే మరుసటిరోజు ఉదయం తిరుపతి చేరుకుంటుందన్నారు.

కాకినాడ పోర్టు నుంచి మరో ప్రత్యేకరైలు (07249) మధ్యాహ్నం 2.50గంటలకు బయల్దేరి విజయవాడ, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా తిరుపతికి మరుసటి రోజు చేరుకుంటుందన్నారు.

అనంతరం ఈ రైలు (07250) రాత్రి 10.30గంటలకు తిరుపతిలో బయల్దేరి వచ్చిన మార్గంలోనే ప్రయాణిస్తూ మరుసటి రోజు ఉదయం కాకినాడపోర్టుకు చేరుకుంటుందన్నారు. ఈ రెండు రైళ్లు రోజూ నడుస్తాయన్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.