సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 12 జనవరి 2021 (10:30 IST)

అభివృద్దా- అవినీతా? ఏది కావాలి? తిరుపతి ప్రజలు తేల్చుకోవాలి: సోమువీర్రాజు

తిరుపతి పార్లమెంటు ఒటర్లు ''అభివృద్దా- లేక అవినీతా'' ఏది కావాలో వారే తేల్చుకోవాలని ఓటర్లకు భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు స్పష్టం చేశారు. రుపతి తూర్పుమండలానికి చెందిన 25 పోలింగ్‌ బూత్‌ కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న సోమువీర్రాజు మాట్లాడుతూ, అవినీతిరహితపాలనతో, మౌొలికసదుపాయల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తూ అందరినీ అభివృద్ది చేయడమే లక్ష్యంగా మోదీ నేతృత్వంలో భాజపా పనిచేస్తుందన్నారు.

కాని రాష్ట్రంలో ఇప్పటి వైకాపా, గత తెదేపా ప్రభుత్వాలు కుటుంబ, వారసత్వ రాజకీయాలు చేస్తూ, ప్రజల సొమ్మును అడ్డగోలుగా దోచేస్తున్నాయని విమర్శించారు. ఇలంటిపాలనకు చమరగీతం పాడాలని, ఈ పార్టీలను రాష్ట్ర రాజకీయాల నుంచి పారద్రోలాలని ప్రజలను కోరారు. ఇంకా ఆయన ఇలా అన్నారు....
 
జాతీయ భావన, దేశభక్తి, మానవ, దేశాభివృద్ది లక్ష్యంతో భాజపా ఏర్పాటైంది. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయినా వాజ్‌పేయి వచ్చేవరకూ దేశంలో సెల్‌ఫోన్లు లేవు. 4 లైన్ల రహదార్లు లేవు. గ్యాస్‌ కొరత ఉండేది. గ్రామాల్లో రోడ్లు లేవు. ఎస్టీలకు మంత్రివర్గంలో స్ధానం లేదు. సమాజంలో మౌలికసదుపాయాలు, కనీస వసతులు లేవు. కాంగ్రెస్‌ 2004 నుంచి 14 వరకు పదేళ్లకాలంలో లక్షల కోట్లు దోచేసింది.

దేశంలో రాజకీయం అవినీతిమయమైన సమయంలో ప్రధాని మోదీ అవినీతిరహితపాలనలో ప్రజలకు సందేశమిచ్చారు. నాయకులకు స్ఫూర్తిగా నిలిచారు. ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా భారత్‌ ఎదగాలన్నది భాజపా ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి దేశంలో ఇసుకదోపిడిదారులు, ఎర్రచందనం దుంగల దోపిడిదార్లు నాయకులుగా ఉండి నిలువునా దోచేస్తున్నారు.

మనల్ని తాకట్టుపెట్టి కానుకలతో ప్రభావితం చేసి లక్షల కోట్లు తినేస్తున్నారు. చంద్రబాబు, జగన్‌ల దోపిడి పార్టీలను రాజకీయాల నుంచి తరిమికొట్టాలి. తిరుపతి  అభివృద్దికి మోదీ ప్రభుత్వం వేల కోట్లు కేటాయించింది. వైకాపా ప్రభుత్వం తిరుపతి అభివృద్ధికి ఏం చేసిందో దమ్ముంటే చర్చకు రావాలి. అమృత పథకం నిధులతో పార్కులు నిర్మించాం. స్మార్ట్‌సిటిగా అమోదించి రూ.2 వేల  కోట్లు తిరుపతికి ఇస్తే ఆ డబ్బులో కమిషన్‌లు తినేసుతన్నారు. ఇసుకను, ఎర్రచందనం దుంగలు తీలేసుకుంటున్నారు. 
 
జగన్‌ ఇచ్చే 30 లక్షల పట్టాలకు భూసేకరణ, వాటికి మౌలికసదుపాయలకు చేసిన రూ.9 వేల కోట్లలో రూ.3 వేల కోట్ల నుంచి రూ.4 వేల కోట్లు అవినీతి జరిగింది. ఎకరా పది లక్షలు విలువైన భూమిని రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షలకు కొనేసి మేసేసారు. ఈ భూముల్లో రూ.3 వేల కోట్లతో కేంద్రానికి చెందిన ''నరేగా '' నిధులతో రోడ్లు వేయించారు. కొండలను తవ్వేసి మట్టిని అమ్మేశారు.

ఇందులో రూ.3 వేల కోట్లు నాకేశారు. ఇందులో కట్టే 15 లక్షల ఇళ్ల  నిర్మాణానికి ప్రధాని మోదీ రూ.28 వేల కోట్లు ఇస్తున్నారు. ఇళ్లు కట్టేది మోదీనా లేక వైకాపానా ? డబ్బు మోదీ ప్రభుత్వానిది..ప్రచారం వైకాపాదా? తిరుపతిలో తిరిగే గ్రీన్‌వాహనాలు, మోదీ పంపినవే. కేంద్ర పథకాలు, స్మార్ట్‌సిటీ పథకాల్లో గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం లంచాలు తీసుకుంటున్నారు.

వారిది కుటుంబ, వారసత్వపార్టీ. భాజపా సకల జనుల పార్టీ. ప్రజల ఓటు అవినీతిపరులు, లంచాలు తీనేవారికా? లేక అభివృద్ది చేసేవారికా తేల్చుకోవాలి. మోదీ నాయకత్వాన్ని సమర్దిస్తూ తిరుపతి పార్లమెంటు సీటును కమలానికి వేసి గెలిపించాలి.