శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 25 డిశెంబరు 2020 (23:21 IST)

అభివృద్ధిలో రాయచోటిని ముందంజలో నిలుపుతా: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

రాష్ట్ర సంక్షేమాభివృద్ధిలో వై ఎస్ అంటే ఓ యెస్ అన్న విషయం అన్ని వర్గాల ప్రజలకు తెలిసిన విషయమని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని రాయచోటి రూరల్ మండల పరిధిలోని యండపల్లెలో ఎం ఎల్ సి జకియా ఖానం, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) సాయికాంత్ వర్మలతో కలసి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాజీ ఎంపిపి పోలు సుబ్బారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇళ్ళు లేని కుటుంబాలు ఉండకూడదని లక్ష్యంతో సీఎం జగన్ పనిచేస్తున్నారన్నారు.నాడు దివంగత నేత వై ఎస్ ఆర్ పూరిగుడిసెలు కనిపించకుండా పక్కా భవనాలుకు  నాంది పలికారన్నారు.

ఆరోగ్యశ్రీ,108,104,ఫీజు రీయంబర్స్మెంట్, మహిళలకు పావలా వడ్డీ లేని రుణాలు, యండపల్లె, మాధవరం తదితర గ్రామాల్లో రహదారులు, యండపల్లె లో పి హెచ్ సి తదితర ఎన్నో సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలు ను చేపట్టి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారన్నారు.15 ఏళ్ల చంద్రబాబు పాలనలో చెప్పుకునేదానికి ఒక్క సంక్షేమ పథకమైన ఉందా అని అన్నారు.

ప్రజానేత జగన్ తన3600 కిమీ మేర చేసిన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను కళ్లారా చూసి ఇచ్చిన హామీల ను, ఎన్నికలలో ఇచ్చిన రెండు పేజీల మ్యానిఫెస్టోలో   ఇచ్చిన హామీలను 16 నెలల పాలనలో 90 శాతంకు పైగా హామీలను నెరవేర్చిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందన్నారు. కరోనా తో ఆర్థిక   సంక్షోభంఏర్పడినా రాష్ట్రంలో మాత్రం సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా లోటు రానీయకుండా  ప్రజల ముఖాలలో చిరునవ్వును చూసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు.

65 లక్షల మందికి పైగా పెన్షన్లు ఇస్తున్నారన్నారు. సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు 4 విడతలుగా రుణాలను మాపీ చేస్తామని చెప్పి, ఇప్పటికే ఒక విడత రుణ మాపీ చేశారన్నారు.ఎస్ సి, ఎస్ టి ,బి సి, మైనారిటీ మహిళలకు వై ఎస్ ఆర్ చేయూత క్రింద ఆర్థిక సహాయాన్ని అందచేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి చర్యలు చేపట్టారన్నారు.

విద్యార్థులుకు ఆమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, మధ్యాహ్న భోజనం, రైతులకు రైతు భరోసా, పంటలకు మద్దతు ధర, పంటరుణాలకు సున్నా వడ్డీ తదితర పథకాలును అందిస్తున్నారన్నారు. వర్షాలు కు నవంబర్ నెలలో  పంటలు నష్టపోయిన వారికి డిసెంబర్ 29 న పరిహారం అందుతుందన్నారు. రాయచోటి ప్రాంతం లోని చెరువులన్నింటికీ కృష్ణా జలాలను అందించే  కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయన్నారు.

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాయచోటి నియోజకవర్గానికి 1700 పక్కా ఇళ్లను మంజూరు చేశారని, ఆ ఇళ్లకు నేటికి రూ 4 కోట్ల రూపాయల బిలులు  బకాయిలు ఉన్నాయని, ఆ బిల్లులనూ ఈ ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. రజకులు, టైలర్లు, నాయీ బ్రాహ్మణులు , ఆటో కార్మికులకు ఆర్థిక సహాయం అందిస్తూ వచ్చారన్నారు.

బోయపల్లె సమీపంలోని గరికుంట ఆనకట్ట అభివృద్ధి కి ఆరు మాసాలలో చర్యలు తీసుకుంటామన్నారు.వెలిగల్లు ప్రాజెక్ట్ నుంచి చెరువులకు నీళ్లు అందించే  రూ 90 కోట్లతో చేపట్టిన  పనులతో  కాటిమాయకుంట, మాధవరం తదితర గ్రామాల్లో చెరువులకు నీళ్లు అందించే పనులు జరుగుచున్నాయన్నారు.