శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 27 డిశెంబరు 2020 (06:55 IST)

తిరుపతి ఉపఎన్నికలో బండి వ్యూహాలు పనిచేస్తాయా!?

మొన్న దుబ్బాక ఉప ఎన్నికలు.. నిన్న జీహెచ్ఎంసీ ఎన్నికలు.. ఇప్పుడు బండి సంజయ్‌కు హైకమాండ్‌ కొత్త టాస్క్‌ అప్పగించిందా? ఆయన్ని ముందే స్పాట్‌కు పంపించి అక్కడ హైప్ క్రియేట్ చేయాలని సూచించిందా? తెలంగాణలో వర్కౌట్‌ అయిన బండి వ్యూహాలు తిరుపతి ఉపఎన్నికలో పనిచేస్తాయా? 
 
ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు బండి సంజయ్‌. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడయ్యాక బండి సంజ‌య్ త‌న‌దైన ముద్ర వేస్తున్నారు. ప్రభుత్వ తప్పిదాలను.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బండి చేస్తోన్న వ్యాఖ్యలు ఆయ‌న‌కు ప్రజల్లో ప్రత్యేక స్థానం తెచ్చిపెట్టాయి. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఆయన గ్రాఫ్ వేగంగా పెరుగుతోంది.

ఇక దుబ్బాక ఉప ఎన్నిక‌లు, గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నికల్లో ఆయ‌న చేసిన సవాళ్లు, విమర్శలు తీవ్ర సంచ‌ల‌నం రేపాయి. కాకలు తీరిన టీఆర్‌ఎస్‌ పెద్దలను ఎదురుదాడితో కంగు తినిపించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారమంతా ఆయ‌న చుట్టే తిప్పుకున్నారు.

టీఆర్ఎస్, కాంగ్రెస్ సీనియర్ నేతల కంటే బండి సంజ‌య్ కామెంట్సే హాట్ హాట్‌గా మారాయన్న చర్చలు సాగాయి. దుబ్బాక ఉప ఎన్నిక విజయం.. ‌గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ పుంజుకోవడంతో జాతీయ నాయ‌క‌త్వం దగ్గర బండి మంచి మార్కులు సంపాదించారట.
 
కమలం పార్టీ అధిష్టానం బండి సంజ‌య్‌ను స‌క్సెస్ ఫుల్ లీడ‌ర్‌గా భావిస్తోందట. దీంతో హైకమాండ్‌ ఆయనకు అద‌న‌పు బాధ్యతలు కట్టబెట్టేప‌నిలో ఉన్నట్లు తెలుస్తోంది. సంజయ్‌ను తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా వాడుకునేందుకు స్కెచ్ వేస్తోందట.‌ ఇందులో భాగంగా త్వరలో జరగనున్న తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో బండితో ప్రచారం చేయించాల‌ని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

అయితే అంతకంటే ముందుగానే సంజయ్‌ను తిరుప‌తికి పంపించి హైప్ తీసుకురావాలని కమలనాథులు ప్లాన్‌ చేస్తున్నారట. ఇదే అంశంపై ప్రస్తుతం పార్టీలో చర్చలు జరుగుతున్నాయనే టాక్‌ వినిపిస్తోంది.

నిజానికి ఈనెలఖారులో బండి సంజయ్ తిరుపతి టూర్‌ ఉండొచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నా.. బిజీ షెడ్యూల్ వలన ఆయన పర్యటన‌ కొత్త ఏడాది మొదట్లో ఉంటుందని సమాచారం.

వచ్చే మార్చిలో తిరుపతి ఉప ఎన్నిక జరిగే అవకాశముందనీ.. నోటిఫికేషన్ రాకముందే సంజయ్‌ను తిరుపతికి పంపటం ద్వారా ఎన్నికల వేడిని రాజేయాలనేది కమలనాథుల ఆలోచనగా చెబుతున్నారు.
 
కమలం పార్టీ అధిష్టానం బండి సంజ‌య్‌ను స‌క్సెస్ ఫుల్ లీడ‌ర్‌గా భావిస్తోందట. దీంతో హైకమాండ్‌ ఆయనకు అద‌న‌పు బాధ్యతలు కట్టబెట్టేప‌నిలో ఉన్నట్లు తెలుస్తోంది. సంజయ్‌ను తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా వాడుకునేందుకు స్కెచ్ వేస్తోందట.‌ ఇందులో భాగంగా త్వరలో జరగనున్న తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో బండితో ప్రచారం చేయించాల‌ని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

అయితే అంతకంటే ముందుగానే సంజయ్‌ను తిరుప‌తికి పంపించి హైప్ తీసుకురావాలని కమలనాథులు ప్లాన్‌ చేస్తున్నారట. ఇదే అంశంపై ప్రస్తుతం పార్టీలో చర్చలు జరుగుతున్నాయనే టాక్‌ వినిపిస్తోంది. నిజానికి ఈనెలఖారులో బండి సంజయ్ తిరుపతి టూర్‌ ఉండొచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నా.. బిజీ షెడ్యూల్ వలన ఆయన పర్యటన‌ కొత్త ఏడాది మొదట్లో ఉంటుందని సమాచారం.

వచ్చే మార్చిలో తిరుపతి ఉప ఎన్నిక జరిగే అవకాశముందనీ.. నోటిఫికేషన్ రాకముందే సంజయ్‌ను తిరుపతికి పంపటం ద్వారా ఎన్నికల వేడిని రాజేయాలనేది కమలనాథుల ఆలోచనగా చెబుతున్నారు.
 
మరోవైపు తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేయాలని బీజేపీ తన మిత్రపక్షమైన జనసేన పార్టీ భావిస్తున్నాయి. అయితే  సంజ‌య్ తిరుపతి వెళ్ళి వ‌స్తే ఎవరు పోటీచేసినా ఖచ్చితంగా బలం‌ పెరుగుతోందన్న భావ‌న‌లో కమలం పార్టీ పెద్దలు ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

మరోవైపు తెలంగాణతో పోల్చుకుంటే ఏపీ రాజకీయాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. తెలంగాణలో ఎంఐఎంను బీజేపీ టార్గెట్ చేస్తూ వస్తోంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని బీజేపీ భావిస్తోందట. ముఖ్యంగా మత మార్పిళ్లను ఏపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని కమలనాథులు ఆరోపిస్తున్నారు.

తిరుమల కొండపై అన్యమత ప్రచారాలు జరుగుతున్నాయన్న అంశాలను ప్రచార అస్త్రాలుగా మలుచుకోవాలని చూస్తున్నారట. బండి సంజయ్‌తో పాటు ధర్మపురి అరవింద్, రాజాసింగ్, రఘునందనరావులను సైతం తిరుపతి ఉప ఎన్నిక ప్రచారనికి పంపాలని బీజేపీ హైకమాండ్‌ ఆలోచిస్తుందట. అయితే తెలంగాణ‌లో సక్సెస్ అయిన బండి సంజయ్ ఫార్ములా ఆంధ్రప్రదేశ్‌లో వర్కౌట్‌ అవుతుందో లేదో చూడాలి.