ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 13 మార్చి 2021 (10:47 IST)

ఏప్రిల్‌ 1 నుంచి 12 ప్రత్యేక రైళ్లు

ప్రయాణీకుల సౌకర్యార్థం ఏప్రిల్‌ 1 నుండి 12 ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ రైళ్లలో కొన్ని రోజువారీ మెయిల్‌ సర్వీసులు ఉండగా, మరికొన్ని వీక్లీ రైళ్లు ఉన్నాయి. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ క్రమక్రమంగా ప్రత్యేక రైళ్ల సర్వీసులను పెంచుతూ వస్తోన్న క్రమంలో.. తాజాగా దక్షిణ మధ్య రైల్వే ఏప్రిల్‌ 1 వ తేదీ నుంచి మరో 12 రైళ్లను పునరుద్ధరించేందుకు సన్నద్ధమయింది.
 
ఈ రైళ్లు ఏప్రిల్‌ 1 వ తేదీ నుంచి ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నాయి. వీటిని ప్రత్యేక రైళ్లుగా దక్షిణ మధ్య రైల్వే నడపనుంది. ప్రస్తుతం రైల్వే శాఖ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రత్యేక రైళ్లుగా నడుపుతుంది. ప్యాసింజర్‌ రైళ్లను మాత్రం ఇంకా పునరుద్ధరించలేదు. రోజువారీ రైళ్ల కోసం జనాలు ఇంకా ఎదురుచూస్తున్నారు.
 
ఏప్రిల్‌ 1 నుంచి పట్టాలెక్కనున్న రైళ్ల వివరాలు..
 
విజయవాడ సాయినగర్‌ షిర్డి
విజయవాడ (మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌) : 07207/07208
విజయవాడ - సికింద్రాబాద్‌ - విజయవాడ (మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌) : 02799 / 02800
విశాఖపట్నం - సికింద్రాబాద్‌ - విశాఖపట్నం (మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌) : 02739 / 02740
గుంటూరు - విశాఖపట్నం - గుంటూరు : 07239 / 07240
గూడూరు - విజయవాడ - గూడూరు (మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌) : 02734 / 02644
నర్సాపూర్‌ - ధర్మవరం - నర్సాపూర్‌ (మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌) : 07247 / 07248