శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (08:57 IST)

ఏప్రిల్‌ 1 నుంచి గుంటూరు-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌

గుంటూరు-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ని రైల్వేశాఖ ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి పట్టాలెక్కించబోతోంది. ప్రస్తుతానికి రిజర్వుడ్‌ సర్వీసుగానే ఈ రైలుని నడపనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.

నెంబరు.07251 గుంటూరు - కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ నిత్యం రాత్రి 7 గంటలకు బయలుదేరి 7.17కి పేరేచర్ల, 7.28కి ఫిరంగిపురం, 7.49కి నరసరావుపేట, 8.19కి వినుకొండ, ఆ తర్వాత కురిచేడు, దొనకొండ, గజ్జలకొండ, మార్కాపురం రోడ్డు, తర్లుపాడు, కంభం, జగ్గంబొట్ల కృష్ణాపురం, సోమిదేవిపల్లె, గిద్దలూరు, దిగువమెట్ట, గాజులపల్లి, అర్ధరాత్రి 12.05కి నంద్యాల, బేతంచర్ల, ద్రోణాచలం, శ్రీబాల బ్రహ్మేశ్వర జోగులాంబ, గద్వాల్‌, శ్రీరాంనగర్‌, వనపర్తిరోడ్డు, మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, షాద్‌నగర్‌, ఉందానగర్‌, బద్వేల్‌, ఫలక్‌నుమా, మలక్‌పేట మీదుగా మరుసటిరోజు ఉదయం 9.45కి కాచిగూడ చేరుకొంటుంది.

నెంబరు.07252 కాచీగూడ - గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ నిత్యం మధ్యాహ్నం 3.10 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి దాటాక 12.05కి నంద్యాల, మరుసటిరోజు వేకువజామున 3.15కి వినుకొండ, 3.44కి నరసరావుపేట, 4.05కి ఫిరంగిపురం, 4.16కి పేరేచర్ల, ఉదయం 6.45కి గుంటూరు చేరుకొంటుంది. ఈ రైలులో ఒక ఏసీ త్రీటైర్‌, ఆరు స్లీపర్‌క్లాస్‌, 9 సెకండ్‌ సిట్టింగ్‌, 2 బ్రేక్‌ వ్యాన్‌ కలిపి మొత్తం 18 బోగీలుంటాయి. 
 
పేరేచర్ల నుంచి పార్శిల్‌ రవాణా  
పేరేచర్ల రైల్వేస్టేషన్‌ నుంచి పార్శి ల్‌ రవాణా సౌకర్యాన్ని రైల్వేశాఖ ప్రారంభించింది. 23టన్నుల మిర్చి టిక్కీలను ఇక్కడి నుంచి నాగాలాండ్‌ రాష్ట్రంలోని దిమాపూర్‌ రైల్వే స్టేషన్‌కి పార్శిల్‌ వ్యాన్‌ ద్వారా పంపించింది. పేరేచర్ల రైల్వేస్టేషన్‌ గుంటూరు - అనంతపురం రోడ్డు మార్గంలో ఉంది.

జాతీయ రహదారి నెంబరు. గుంటూరు నుంచి సాతులూరు వరకు రైల్వేడబ్లింగ్‌ కూడా పూర్తయింది. ఈ సౌకర్యాలు నేపథ్యంలో మిర్చి, ఇతర సరుకులు ఎగుమతి చేయ దలచిన వర్తకులు పేరేచర్ల రైల్వేస్టే షన్‌లో సంప్రదించాలని సీనియర్‌ డీసీఎం నరేంద్రవర్మ విజ్ఞప్తి చేశారు.