బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 11 మార్చి 2021 (12:38 IST)

ఏప్రిల్ ఒకటి నుంచి తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ పరుగులు

సికింద్రాబాద్ ‌- కాచిగూడ - కర్నూలు సిటీ తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ రైలు ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి తిరిగి ప్రారంభంకానుంది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో రద్దు చేసిన ఈ రైలు కోసం నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్నారు.
 
మహబూబ్‌నగర్‌లో పనిచేసే ఉద్యోగులు ఈ రైలులో వెళ్లి తిరిగి నగరానికి వస్తుంటారు. ఇది సికింద్రాబాద్‌లో ఉదయం 7.40 గంటలకు బయలుదేరి 7.50 గంటలకు కాచిగూడకు వస్తుంది. మలక్‌పేట, ఫలక్‌నుమా, ఉందానగర్‌ (శంషాబాద్‌), షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌కు (9.55 గంటలు), గద్వాల మీదుగా మధ్యాహ్నం 12.30 గంటలకు కర్నూలు నగరానికి చేరుకుంటుంది. 
 
తిరిగి ఈ రైలు కర్నూలులో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి మహబూబ్‌నగర్‌ (5.15 గంటలు) తదితర స్టేషన్ల మీదుగా రాత్రి 7.18 గంటలకు కాచిగూడకు, 7.55 గంటలకు తిరిగి సికింద్రాబాద్‌కు వస్తుంది.