సంబంధిత వార్తలు
- అక్కినేని నాగార్జున 'వైల్డ్ డాగ్' ఎలా వుందంటే? రివ్యూ
- గుడ్ న్యూస్ చెప్పిన దియా మీర్జా.. మాల్దీవుల్లో ఎంజాయ్.. ప్రెగ్నెంట్‌గా వున్నానని పోస్ట్
- వైల్డ్‌డాగ్ ఏప్రిల్‌ఫూల్ చేసింది.
- శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పేలిన నాటు బాంబులు.. ప్రాణాలు కోల్పోయిన...
- ఫిట్నెస్ వల్లే యాక్షన్ కష్టం అనిపించలేదుః నాగార్జున
నాలుగేళ్ల పాపపై మూడు వీధికుక్కలు పడ్డాయి.. ఏడుపు శబ్ధం విని..?
నాలుగేళ్ల పాప వీధికుక్కల దాడికి గురైన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. ఒకటి కాదు.. ఏకంగా మూడు కుక్కలు నాలుగేళ్ల పాపపై దాడికి దిగడంతో ఆ పాప వాటి నుంచి తప్పించుకోలేక ఏడ్వసాగింది. కేకలు పెట్టింది. ఆ పాప ఏడుపులు విని స్థానికులు పరుగులు తీసుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు ఆ కుక్కలను తరిమికొట్టారు. పాపను రక్షించి ఆస్పత్రిలో చేర్చారు. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో స్థానిక బస్ డిపో ముందు ఉన్న కాలనీలో ఘోరం జరిగింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
నందిని అనే నాలుగేళ్ల చిన్నారి రోడ్డుపై ఒంటరిగా నడుస్తూ వెళ్తోంది. ఆమె వెళ్తున్న రోడ్డు పక్కన ఓ కుక్క ఉంది. ఆ పాప దాన్ని అసలు పట్టించుకోకుండా ముందుకు వెళ్లసాగింది. ఇంతలోనే ఊహించని రీతిలో ఆ కుక్క నందినిపై దాడి చేసింది. పాపను నోట పట్టుకుని పొదల్లోకి లాక్కెళ్లిపోసాగింది. నడిరోడ్డు మీద నుంచి చివరి వరకు ఈడ్చుకెళ్లింది. ఆ కుక్కకు తోడు మరో మూడు కుక్కలు కూడా తోడవడంతో పాప భయాందోళనకు గురయింది.
కుక్కలు తనపై దాడి చేస్తోంటే ఏం చేయాలో తెలియక, వాటిని ప్రతిఘటించలేక గుక్కపట్టి ఏడవసాగింది. ఆ పాప ఏడుపులు విన్న స్థానికులు ఉరుకులు పరుగుల మీద ఘటన స్థలానికి చేరుకున్నారు. కుక్కలను తరిమి కొట్టారు. ఆ పాపను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి వెంటనే తరలించారు. పాప కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు అయినట్టు గుర్తించారు. చిన్న పిల్లలను ఒంటరిగా వదిలేస్తే ఇలాంటి ఘోరాలు కూడా జరుగుతున్నాయంటూ స్థానికులు వాపోతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీ కెమెరాలో రికార్డయింది. అది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.
