గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (11:07 IST)

గుడ్ న్యూస్ చెప్పిన దియా మీర్జా.. మాల్దీవుల్లో ఎంజాయ్.. ప్రెగ్నెంట్‌గా వున్నానని పోస్ట్

Dia Mirza
ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి దియా మీర్జా త‌న అభిమానుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది.  తాజాగా ‘వైల్డ్ డాగ్’ సినిమాతో అక్కినేని నాగర్జునకు జోడీగా దియా మీర్జా నటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను త‌ల్లిని కాబోతున్నాన‌ని ఇన్‌స్టా వేదిక‌గా దియా తెలిపింది. ఇంకా తన బేబీ బంప్‌తో కూడిన ఫోటోను షేర్ చేసింది. కాగా ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 15న వ్యాపార‌వేత్త వైభ‌వ్ రేఖిని దియా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఈ జంట‌.. ఓ అంద‌మైన ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. 
 
సూర్యాస్త‌మ‌యంలో స‌ముద్రం ఒడ్డున నిల‌బ‌డిన దియా.. త‌న క‌డుపులో పెరుగుతున్న బిడ్డ‌ను చేతుల‌తో అదుముకుంటూ ఉన్న ఫోటోను షేర్ చేసి, తాను ప్రెగ్నెంట్ అని చెప్పింది. ఈ ఫోటోతో పాటు ఓ భావోద్వేగ‌మైన క‌విత‌ను కూడా ఆ న‌టి పోస్టు చేసింది. ఈ సంద‌ర్భంగా దియాకు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, షిబానీ దండేక‌ర్, తాహీరా క‌శ్య‌ప్‌, మ‌హీప్ క‌పూర్‌తో పాటు ప‌లువురు శుభాకాంక్ష‌లు తెలిపారు.
 
దియా మీర్జా గ‌తంలో సాహిల్ సంఘా అనే వ్య‌క్తిని పెళ్లాడింది. పెళ్లైన 11ఏళ్ల త‌ర్వాత అంటే 2019లో సాహిల్ నుంచి దియా విడిపోయారు. ఆ త‌ర్వాత వైభ‌వ్‌ను ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 15న వివాహ‌మాడింది. ఈ పెళ్లి వేడుక‌కు కుటుంబ స‌భ్యుల‌తో పాటు ద‌గ్గ‌రి బంధువులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు.