బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (16:38 IST)

దియా మీర్జా రెండో పెళ్ళి సంద‌డే సంద‌డి

Diamirza wedding, vybahv
న‌టి దియా మీర్జా పెళ్లి ఫొటోలు, ట్వీట్‌లు, శుభాకాంక్ష‌ల‌తో మంగ‌ళ‌వారంనాడు సోష‌ల్‌మీడియా సంద‌డిగా నెల‌కొంది. తాప్సీ, నేహాదూపియా, మ‌ల్లికా అరోరా వంటి న‌టీమ‌ణులు దియాకు, వైభ‌వ్‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ, ప్రేమనేది ఎప్ప‌డు పుడుతుందో అప్పుడే నిజ‌మైన ప్రేమ అంటూ సినిమాటిక్‌గా వారిని ఆశీర్వ‌దించారు. సోమ‌వారంనాడు దియా వ్యాపార‌వేత్త వైభ‌వ్ రేఖితో వివాహం జ‌రిగింది. వారిద్ద‌రిమ‌ధ్య కొంత‌కాలంగా ప్రేమాయ‌ణం సాగుతోంది. దియాకిది రెండో వివాహం. మొద‌టి వివాహం నిర్మాత సాహిల్ సంఘాతో జ‌రిగింది. 2019లో వీరు విడిపోయారు. ఇక వైభ‌వ్ మొద‌టి భార్య యోగా, లైఫ్‌స్ట‌యిల్ ఇన్స్‌ట్ర‌క్ట‌ర్ సున‌య‌న‌. ఈమెకూడా త‌న కుటుంబంలో దియా వివాహానికి హాజ‌ర‌య్యారు. 
 
దియా, వైభ‌వ్ పెళ్లి ఫోటోలు సోష‌ల్‌మీడియా పెట్టింది. ఇందులో అదితిరావుకూడా హాజ‌ర‌యి స‌ర‌దాగా గ‌డిపింది.  దియా రెడ్ సారీలో మెరిసిపోగా, వైభ‌వ్ కుర్తాలో క‌ల‌ర్‌ఫుల్‌గా క‌నపించాడు. వీరి ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.  అదితీ రావు హైద‌రి స‌ర‌దాగా వ‌రుడిని ఆట‌ప‌ట్టించింది. మండ‌పం ద‌గ్గ‌ర‌కు వెళ్లే ముందు వ‌రుడి చెప్పులు దాచ‌డం జ‌రిగింది. చెప్పుల‌తో దిగిన ఫొటోను అదితి త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.  దియా ప‌ళ్లి సంద‌డిగా సాగింద‌ని ఆమె పేర్కొంది. కాగా, దియా మీర్జా తెలుగు చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’లో కీ రోల్ చేస్తోంది. త్వ‌ర‌లో విడుద‌ల‌కాబోతుంది.