శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 జనవరి 2021 (16:37 IST)

ఆమెకు అబార్షన్ చేయండి.. వైద్యులకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం

కడుపులో పెరుగుతున్న బిడ్డకు  పుర్రెభాగంలో ఎముకల సమస్య ఉన్నట్టు వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో ఆమెకు అబార్షన్ చేయాల్సిందిగా వైద్యులను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఢిల్లీకి చెందిన ఓ మహిళ గర్భందాల్చింది. కానీ, 28 వారాల తర్వాత అబార్షన్ చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనికి కారణం... అల్ట్రాసౌండ్ స్కానింగులో తన గర్భంలో ఉన్న పిండం పుర్రెభాగంలో ఎముకల ఎదుగుదల సమస్య తలెత్తినట్లు డాక్టర్లు చెప్పారని, గర్భిణీ కోర్టుకు సంబంధింత రిపోర్టులను అందజేశారు. దీన్ని అనెన్సుఫాలీ వ్యాధిగా పిలుస్తారు.
 
అయితే, మహిళా పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఎయిమ్స్ డాక్టర్ల ఆధ్వర్యంలో మరోసారి పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో అనెన్సుఫాలీ సమస్య ఉన్నట్లు ఎయిమ్స్ డాక్టర్లు నిర్ధారించారు. దీంతో బాధితురాలి అబార్షన్‌కు ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టీస్ జ్యోతీ సింగ్‌ల బెంచ్ అనుమతిస్తూ తీర్పు వెల్లడించింది. విచారణ చేపట్టిన కోర్ట్ సైతం ఆమె అబార్షన్ చేయించుకోవడమే ఉత్తమమని సలహా ఇచ్చింది.