సంబంధిత వార్తలు
- రేపటితో ముగియనున్న గ్రూపు-1 దరఖాస్తు గడువు
- 03-06-2022 శుక్రవారం రాశిఫలాలు ... కామేశ్వరిదేవిని పూజిస్తే సర్వదా శుభం...
- NEFR Recruitment 2022: 5636 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
- తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం: దేశానికే ఆదర్శంగా తెలంగాణ అంటున్న కేసీఆర్
- 02-06-2022 గురువారం రాశిఫలాలు - లక్ష్మి కుబేరుడిని ఆరాధించిన...
తెలంగాణాలో జూన్ 6న గురుకుల కాలేజీల ప్రవేశ పరీక్ష
ఈ నెల ఆరో తేదీన గురుకుల కాలేజీల్లో ప్రవేశాలకు ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణా గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సీహెచ్.రమణ కుమార్ తెలిపారు.
తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశానికి ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ యేడాది ఈ నెల 6వ తేదీ సోమవారం నిర్వహించనున్నట్టు ప్రకటించారు.
ఈ పరీక్ష కోసం హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు సిద్ధిపేట, సంగారెడ్డి జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇది ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగనుంది.
గురుకుల వెబ్ సైట్ నుంచి ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే, హాల్ టిక్కెట్లలో ఏవేని తప్పులు దొర్లినా, అక్షర దోషాలు ఉన్నా పరీక్షా కేంద్రం వద్దకు తగిన ఆధారాలతో వెళ్లి సరిచేసుకోవచ్చని సూచించారు.
తర్వాతి కథనం
