శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 జూన్ 2022 (13:01 IST)

ఒక్క సినిమా టిక్కెట్‌పై 2 శాతం కమిషన్.. థియేటర్ వద్ద నో సేల్

Cinema hall ph
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్ల టిక్కెట్లను కేవలం ఆన్‌లైన్ పోర్టల్‌లోనే విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. తద్వారా ఒక్కో సినిమా టిక్కెట్‌పై 2 శాతం కమిషన్‌ను వసూలు చేయాలని తాజాగా ప్రభుత్వం జీవో జారీచేసింది. 
 
పైగా, ఆన్‌లైన్ టిక్కెట్ విక్రయాలు ప్రారంభమైతే థియేటర్ వద్ద భౌతికంగా సినిమా టిక్కెట్లను విక్రయించరు. ఈ మేరకు ఏపీ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మంట్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ టిక్కెట్లను విక్రయించనుంది. 
 
ఇకపై రాష్ట్రంలో ఏ థియేటర్‌‍లోనూ సినిమా చూడాలన్నా ఇదే పోర్టల్‌ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేయాలి. బుక్‌మై షో యాప్ వంటి ఇతర పోర్టల్స్‌ ద్వారా కొనుగోలు చేసినా ప్రభుత్వం 2 శాతం కమిషన్ చెల్లించాల్సివుంటుంది.