శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 జూన్ 2022 (08:33 IST)

ఏపీలో శనివారం వెల్లడికానున్న టెన్త్ పరీక్షా ఫలితాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను శనివారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 
 
ఈ పరీక్షలకు సమారు 6 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. గతంలో మాదిరిగానే ఈ సారీ విద్యార్థులకు వచ్చిన మార్కులనే వెల్లడిస్తారు. అలాగే, గ్రేడింగ్ విధానాన్ని తీసివేసారు. అదేవిధంగా విద్యాశాఖ ర్యాంకులను కూడా ప్రకటించదు. ఈ నేపథ్యంలో విద్యా సంస్థలకు కూడా తమ దగ్గర చదువుకున్న విద్యార్థులకు ఫలానా ర్యాంకులు వచ్చాయని ప్రచారం చేయకూడదు. అలా చేస్తే మాత్రం మూడేళ్ళ కఠిన కారాగార శిక్ష పడేలా చేస్తారు.