శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 మే 2022 (13:39 IST)

నేడు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల

venkateswara swamy
శ్రీవేంకటేశ్వర స్వామి ఆర్జిత సేవా టిక్కెట్లను మంగళవారం విడుదల చేయనున్నారు. ఇవి ఆగస్టు నెలకు సంబంధించిన సేవా టిక్కెట్లు. ఇందులో శ్రీవారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార టిక్కెట్ల కోటాను ఉదయం 9 గంటలకు విడుదల చేస్తారు. 
 
అలాగే, సుప్రభాతం, తోమాల, అర్జన టిక్కెట్లతో పాటు జూలై నెలకు సంబంధించిన అష్టదళ పాదపద్మారాధన సేవా టిక్కెట్లెను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. 
 
ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులు పేర్లు నమోదు చేసుకునే వీలు కల్పిస్తుండగా అదే రోజు సాయంత్రం 6 గంటలకు ఆన్‌లైన్ ద్వారా డిప్ సేవా టిక్కట్లు పొందాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. 
 
మరోవైపు, జూలై, ఆగస్టు నెలకు సంబంధించిన వర్చువల్ కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకరణ టిక్కెట్ల కోటా బుధవారం విడుదల చేయనున్నారు.