ఆదివారం, 24 ఆగస్టు 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 ఆగస్టు 2025 (21:32 IST)

Goddess Lakshmi: పగటి పూజ నిద్రపోయే వారింట లక్ష్మీదేవి వుండదట

Godess Lakshmi
శ్రీ లక్ష్మీదేవి కటాక్షానికి శ్రీమన్నారాయణుని స్మరణ తప్పనిసరి అంటున్నారు పండితులు. శ్రీహరి అనుగ్రహం లేని చోట ఆమె క్షణమూ నిలవదు. ఆయన శక్తి స్వరూపమే లక్ష్మీదేవి. ఆమెను మాత్రమే కోరుకుని, శ్రీమన్నారాయణుని నిరాకరించే స్థలంలో ఆమె ఉండదని దేవీ భాగవతంలో స్పష్టంగా చెప్పబడింది. 
 
ఇంకా శ్రీ దేవీ భాగవతంలో లక్ష్మీదేవి నివాసం వుండే విషయాలను వెల్లడించినట్లు కలదు. తులసిని శ్రద్ధగా పెంచాలి. తులసి చెట్టు ఆరోగ్యంగా ఉండేలా కాపాడాలి. ఇది లక్ష్మీ కటాక్షానికి మొదటి నిదర్శనం. ఇంట్లో తులసి చెట్టు ఎండిపోతుందనే అనుమానం వచ్చినప్పుడు వెంటనే దానిని మార్పిడి చేయాలని పండితులు చెప్తున్నారు. ఇళ్లలో బ్రాహ్మణ సేవ ఉండాలి.
 
వేదం వినడం, బ్రాహ్మణులకు సమారాధన చేయడం, మహాత్ములను ఆహ్వానించి సేవ చేయడం వంటివి జరగుతూ వుండాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం ఖాయం. ఏమీ అవసరం లేకుండా పగటిపూట నిరంతరం నిద్రపోవడం లక్ష్మీ కృపను దూరం చేస్తుంది. అలసత్వం ఉన్న ఇల్లు దైవ అనుగ్రహానికి అర్హత కోల్పోతుంది.