1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 21 మే 2022 (12:14 IST)

జూలై - ఆగస్టు నెలలకు ప్రత్యేక దర్శన టిక్కెట్లను రిలీజ్ చేసిన టిటిడి

tirumala
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) జూలై, ఆగస్టు నెలలకు ప్రత్యేక దర్శనం టిక్కెట్లను రిలీజ్ జేసింది. రోజుకు 25 వేల చొప్పున ఈ టిక్కెట్లను కేటాయించింది. జూలై 15వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనలాను రద్దు చేసింది. ఈ ప్రత్యేక దర్శన టిక్కెట్ల ధర రూ.300గా నిర్ణయించింది. ఈ టిక్కెట్లను టిటిడి ఆన్‌లైన్ పోర్టల్‌లోనే బుక్ చేసుకోవాలని తెలిపింది. రోజుకు 25 వేల చొప్పున ఆన్‌లైన్‌లో ఉంచింది. 
 
మరోవైపు, టిటిడి మరో కీలక ప్రకటన చేసింది. వేసవి సెలవుల్లో శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు కొండపైకి వస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జూలై 15వ తేదీ వరకు ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. వీఐపీ బ్రేక్ దర్శనాలను కేవలం ప్రొటోకాల్ ఉన్న ప్రముఖులకు మాత్రమే పరిమితం చేసినట్టు ఓ ప్రకటనలో తెలిపింది.